ప్రస్తుతం మనరాష్ట్రంలో జరుగబోయే ఎన్నికలను గమనిస్తే, ఆశకు, ఆశయానికి మధ్య జరిగే పోటీలాగానే కనిపిస్తున్నది. ఈ మధ్యనే నాకు వాట్సాప్లో వచ్చిన కొటేషన్ బాగా నచ్చింది. ‘ఆశ ఉన్న వాడికి అధికారమిస్తే అంతా దోచుకు తింటాడు. కానీ ఆశయం ఉన్న వాడికి అధికారమిస్తే అభివృద్ధి చేసి చూపెడుతాడు’ ఈ కొటేషన్ ఇప్పటి మన ఎన్నికలకు సరిగ్గా సరిపోతుంది.
ఒక పార్టీ నాయకుడు దార్శనికత, ఆశయం, తన రాష్ర్ట్టాభివృద్ధిపై పట్టుదల,చిత్తశుద్ధి ఎంత ఉన్న దో గత పది ఏండ్లలో చూపెట్టిన వాడైతే, ఎన్నికల్లో పాల్గొనే ఇతర పార్టీల నాయకులకు ఈ రాష్ర్టాన్ని ఏకం గా కబళించుకుని, అధికార దాహాన్ని తీర్చుకుందామన్న ఆశనే ప్రస్ఫుటంగా కనబడుతున్నది. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యే ముందే తన రాష్ట్రం తాను పాలిం చే 5 ఏండ్లలో ఎట్లా ఆవిష్కరించబడాలో ఒక క్రమబద్ధమైన ప్రణాళిక వేసి ఉంచుకోవాలి. అందుకోసం ఎన్నో పనిగంటల మేధోమథనం జరుగాలి. ఒక రాష్ర్టాన్ని వివిధ రంగాల్లో ఉన్నతంగా నిలబెట్టాలన్న కాంక్ష ఉండాలి.
ప్రస్తుత జాతీయ పార్టీలకు ఒక జాతీయ విధానమం టూ ఉన్నట్టు అనిపించదు. ఒక్కో రాష్ర్టానికి ఒక్కో విధా నం ఉండడం జాతీయత అనిపించుకోదు. సరే, ఒక్కొక్క రాష్ర్టానికి కావలసిన అవసరాలు వేరే ఉండి ఉండవచ్చు. అందుకనుగుణంగా స్థానిక అవసరాల్ని బట్టి అంత మేర కు విధానం భిన్నంగా ఉంటే సరి పోతుంది. కానీ స్థూలం గా ఉండే విధానంలో మార్పు ఉండకూడదు.
తాము ఎన్నిక కాగానే ఫలానా పనులు చేస్తాం, ఫలానా పథకాలు నెరవేరుస్తాం అని మ్యానిఫెస్టోలో పెట్టి, గెల్వగానే వాటిని ఖాతరు చేయకపోవడం, లేదా వాటిని సమూలంగా మార్పు చేయడం వెనుక, హోమ్ వర్క్ సరిగ్గా చేయకపోవడమన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. నేను ప్రస్తావిస్తున్నది కర్ణాటకలోని కాంగ్రెస్ గురించి అని అవలీలగా అర్థమై ఉంటదనుకుంటా. వారు అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే ఫెయిల్ అయ్యారంటే వాళ్ళది అధికార దాహమే కానీ, ప్రజల క్షేమం కాదన్నది స్పష్టమవుతూనే ఉన్నది. తగుదునమ్మా అని అట్లాంటి నాయకులు తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ కు ఓటు వెయ్యండని ప్రచారం చెయ్యడం ఎంత శోచనీయమో !
కర్ణాటకలో ఐదు గ్యారెంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయింది. అలాంటి నాయకులు వందలాది సంక్షేమ పథకాలు అందిస్తున్న తెలంగాణకు వచ్చి ప్రచారం చేస్తామంటే ప్రజలు ఎలా నమ్ముతారు?
ఇంత గొప్ప ప్రగతి, ఇంత తక్కువ కాలంలోనే సాధించినందుకు ఎవరికైనా కన్ను కుట్టక మానదు. ఎవరికీ సాధ్యం కానిది కేసీఆర్కు ఎట్లయ్యిందని ఆయనపై కక్ష కట్టి, ఎలాగైనా ఓడించాలని, దేశ వ్యాప్తంగా ఉన్న నాయకులు, ముఖ్యమంత్రులు, చివ రికి ప్రధాని మోదీ కూడా రాష్ట్రంపై దండయాత్ర చేస్తున్నారు. ఇదీ మన మంచికే అనిపిస్తుంది. వాళ్ల రాకతోనే వారి ఓటమి ఖాయమైందన్న వాస్తవం తెలుస్తున్నది.
ఆశయం ఉన్నతమైనదై, దాన్ని సాధించుకునేందుకు గుణాత్మక మైన మేధోమథనం చేయాలి. తగిన ప్రణాళికను తయారు జేసుకుని, కిందిస్థాయి ప్రజా ప్రతినిధులకు కూడా ఆ ఆశయాన్ని తెలియజేయాలి. అందరూ అదే దిశలో ప్రయాణించేట్టు చేసి, చిత్తశుద్ధితో ముందుకు పోతే ఆ నేతకు ప్రజలు జేజేలు పలుకుతారు. ఎల్లప్పుడూ వారినే ఎన్నుకుంటారనడంలో అనుమానమే లే దు. ఈ కోవకే చెందిన మన ముఖ్యమంత్రికి ప్రజలూ మద్దతు పలికి మూడోసారి ఎన్నుకుంటారనీ, ఆశ ఉన్నవారికి కాక, సదాశయం ఉన్నవారికే తమ ఓటు వేస్తారని ఆశిద్దాం. ముఖ్యమంత్రి హాట్రిక్ సాధిస్తారనీ నమ్ముదాం.
-మాచెర్ల వాణీ మనోహర్
99896 20452