‘ఏమిటోయ్ అంత దిగులుగా ఉన్నావు? నిజానికి నువ్వు ఉత్సాహంతో ఉరకలు వేయాలి..’
‘నా దిగులుకు కారణం తర్వాత చెప్తా, కానీ, నేను ఉత్సాహంగా ఎందుకు ఉరకలు వేయాలో చెప్పు?’
‘మీ పార్టీలోకి మరో ఇద్దరు సీఎం అభ్యర్థులు వస్తున్నారంటే ఉత్సాహంతో ఉరకలు వేయాలి కానీ దిగులెందుకు?’
‘తా దూర సందు లేదు. మెడకో డోలు అని. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు కానీ, ఇప్పటికే నియోజకవర్గానికి కనీసం ముగ్గురు సీఎం అభ్యర్థులున్నారు. 119 నియోజకవర్గాలకు 357 మంది సీఎం అభ్యర్థులు. ఇందులో ఎంతమందికి డిపాజిట్ వస్తుందో తెలియదు కానీ.. వీరు సరిపోరన్నట్టు బయటినుంచి సీఎం అభ్యర్థులు కావాలా? ఐనా ఇద్దరంటున్నావు ఎవరు వాళ్ళు? ఒక్కరే కదా? ఐనా 357 మంది సీఎం అభ్యర్థులను తట్టుకొని నిలబడినవారికి ఇంకో ఇద్దరు సీఎం అభ్యర్థులు చేరితే అదో సమస్యనా? కర్ణాటకలో రెండున్నరేండ్లకు ఓ సీఎం అని ఐదేండ్లను పంచుకున్నట్టు, ఐదు రోజులకు ఓ సీఎం అని పంచుకుంటే ఎలా ఉంటుంది. నిండా మునిగినవారికి చలేమిటి అని’
‘పేపర్లు చదువవా? షర్మిల, బ్రదర్ అనిల్ తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఢిల్లీలో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారట’ ‘షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టాక, బ్రదర్ అనిల్ ఆంధ్రలో పార్టీ పెట్టడానికి ఏర్పాటుచేస్తున్నట్టు, సన్నాహక సమావేశాల గురించి చదివాను. పార్టీ పెట్టడం కోసం తనపై ఒత్తిడి వస్తుందని బావ జగన్ పాలనను విమర్శిస్తూ ఆయన మీడియా ముందు అప్పుడెప్పుడో మాట్లాడింది విన్నాను. పార్టీ పెట్టాడేమో అనుకుంటే ఇప్పుడు షర్మిల పార్టీలో చేరాడా? ఎప్పుడు చేరాడో తెలియనే లేదు’ ‘వైఎస్సార్ అభిమానులంతా చేరుతారనుకొని షర్మిల పార్టీ పెడితే, విజయమ్మ మాత్రమే చేరారు. ఆవిడెవరో శోభా అని ఆమె చేరితే గాడిదలను కాస్తున్నావా? అంటే గాడిదలను కాస్తూ ఉండలేను అని బయటకు వెళ్లిపోయారు. అది తెలుసు కానీ, బ్రదర్ అనిల్ ఎప్పుడు చేరాడో నాకూ తెలియదు. అయినా భారతీయ వివాహ వ్యవస్థ గొప్పతనమే అది. లోకమంతా దూరం పెట్టినా భార్యాభర్తలు ఒకటిగానే ఉంటారు. ఆంధ్రలో సొంతంగా పార్టీ పెట్టాలనే నిర్ణయాన్ని మార్చుకొని తన తండ్రి ఇమేజ్ను నమ్ముకొని భార్య పెట్టిన పార్టీలో చేరాడు చూడు, త్యాగం అంటే అది’.
‘కాంగ్రెస్‌లో చేరేది ఇద్దరే అయినప్పుడు పార్టీలో చేరారు అనాలి. కానీ, విలీనం అనే పెద్దపెద్ద మాటలు ఎందుకు?’
‘చేరారు అంటే ఒకటే టికెట్ ఇస్తారు, విలీనం అంటే ఇంకొన్ని టికెట్లు ఇప్పించుకోవచ్చు’
‘చూడోయ్ కాంగ్రెస్‌లో టికెట్ గ్యారంటీ ఉండదు, గెలుపునకు అసలే గ్యారంటీ ఉండదు. కానీ, పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు తానే కాంగ్రెస్‌లో కాబోయే సీఎంను అనుకొనే సౌకర్యం ఉంటుంది చూడు.. దేశంలో మరెక్కడా ఇలాంటి సౌకర్యం ఉండదు. రెండు సార్లు గెలిచి మూడవసారి గెలవడానికి దూసుకెళ్తున్న బీఆర్ఎస్లో ఒక్కరే సీఎం అభ్యర్థి. రెండు సీట్లు గ్యారంటీగా గెలుస్తారు అని చెప్పలేని బీజేపీలో కనీసం డజన్ మంది సీఎం అభ్యర్థులు ఉంటే, అదే కాంగ్రెస్‌లో 359 + మంది సీఎం అభ్యర్థులున్నారు చూడు అది గ్రేట్’,
‘సీఎం అభ్యర్థులకేంది? ప్రజాశాంతి పార్టీలో కూడా ఉంటారు. శాసనసభ్యులుగా గెలవాలి కదా? ముందు. నాడా దొరికింది. ఇక గుర్రం దొరకాలి అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ పరిస్థితి’
‘ఏ కాంగ్రెస్ పరిస్థితి? నేను చంద్రబాబుకు కర్ణుడి లాంటివాడిని అని చెప్పుకొన్న రేవంత్‌రెడ్డి కాంగ్రెస్నా?, నేను వైఎస్సార్ అనుచరుడిని, సిసలైన కాంగ్రెస్ వాదిని, ఈ ఎన్నికల్లో మాత్రం మా తమ్ముడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాడు. అతనికి ఓటు వేయండని కాంగ్రెస్‌లో ఉండి బీజేపీకి ఓటు వేయమన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్నా? కాంగ్రెస్ వాళ్లే సీనియర్లకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదు చేస్తున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్నా? బెంగళూరు కాంగ్రెస్నా? పులివెందుల కాంగ్రెస్నా? ఏ కాంగ్రెస్?’
‘నువ్వు చెప్పిన కాంగ్రెస్‌ల గురించి తెలుసు కానీ, ఆ బెంగళూరు కాంగ్రెస్ ఏమిటి? పులివెందుల కాంగ్రెస్ ఏమిటి?’
‘పత్రికలు చదువవా? ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ మొత్తాన్ని బెంగళూరు వాళ్లే నడిపిస్తారట. మీ వల్ల కావడం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపించే బాధ్యత ఔట్‌సోర్సింగ్‌లో భాగంగా బెంగళూరు కాంగ్రెస్ నాయకులు శివకుమార్‌కు అప్పగిస్తారట. 2018లో కాంగ్రెస్‌ను బాబుకు అప్పగించి చేసిన ప్రయోగం విఫలం కావడంతో బాబును పక్కనపెట్టి బాబు శిష్యుడు రేవంత్‌కు బాధ్యతలు అప్పగించారనుకొంటే ఇంకా ఎన్నికలు రాకముందే
శివకుమార్‌కు అప్పగించారా?’
‘నీకీ విషయం ఇప్పుడు తెలిసిందేమో కానీ, చాలామందికి ఇది ముందే తెలిసింది. అందుకే షర్మిలతో సహా చాలామంది అటునుంచి నరుక్కురావాలి అని కర్ణాటక ఫలితాలు రాగానే షర్మిల బెంగళూరు వెళ్లి శివకుమార్‌ను కలిసి రాజకీయాలు చర్చించారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చాలామంది శివకుమార్‌ను కలిశారు. గెలిచినా? ఓడినా గతంలో కాంగ్రెస్ బెటర్. వాళ్ల హై కమాండ్ ఢిల్లీలో ఉండేది. ఇప్పుడు బెంగళూరులో ఇంకో హై కమాండ్’
‘ఔను ఇచ్చిన హామీల అమలుకు నిధుల్లేవు అని కర్ణాటక ప్రభుత్వమే చేతులెత్తేసింది కదా? శివకుమార్ ప్రభుత్వాన్ని దారిలో పెట్టవచ్చు కదా?’
‘ఆయనే ఉంటే.. అని అదేదో సామెత చెప్పినట్టు పథకాలు అమలుచేసేందుకు అక్కడ నిధులుంటే ఈ తిప్పలు ఎందుకు?’
‘అంటే షర్మిల పార్టీ విలీనానికి రేవంత్ ఒప్పుకుంటాడా?’
‘రామాయణం అంతా విని.. రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు.. బెంగళూరు నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపించే ఏర్పాట్లు జరుగుతుంటే.. కర్ణాటకలో రెండున్నరేండ్లకు పులివెందుల కన్నా బెంగళూరుతోనే ఎక్కువ అనుబంధం ఉన్న షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతుంటే అడ్డుకొనే శక్తి ఎవరికుంది?’
‘షర్మిల రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేస్తుందా?’
‘పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర అని కూడా నేర్పిస్తుంది’
‘ఒకప్పుడు దేశానికి హేమాహేమీలను అందించిన కాంగ్రెస్ పరిస్థితి తలచుకొంటే ఏమనిపిస్తుంది’
‘పాదాలతో నడిచే యాత్ర పాదయాత్ర.. ఆడబిడ్డను ఆడ బిడ్డ అని ఎందుకంటారు?’ అని షర్మిల కాంగ్రెస్ వారికి పాఠాలు నేర్పిస్తుంటే చూడాలనిపిస్తోంది..’
‘రామాయణం అంతా విని.. రాముడికి సీత ఏమవుతుందని అడిగినట్టు.. బెంగళూరు నుంచి తెలంగాణ కాంగ్రెస్‌ను నడిపించే ఏర్పాట్లు జరుగుతుంటే.. కర్ణాటకలో రెండున్నరేండ్లకు పులివెందుల కన్నా బెంగళూరుతోనే ఎక్కువ అనుబంధం ఉన్న షర్మిల తెలంగాణ కాంగ్రెస్‌లో చేరుతుంటే అడ్డుకొనే శక్తి ఎవరికుంది?’
– బుద్దా మురళి 98499 98087