తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించిన గొప్ప ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శవంతంగా పాలిస్తున్న పరిపాలనాదక్షుడు కేసీఆర్. అలాంటి నాయకునికి కనీస గౌరవం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకులు దిగజారి మాట్లాడుతున్నారు. చిన్నా, పెద్దా అనే మర్యాద లేకుండా నోటికి ఎంత వస్తే అంతా సీఎం కేసీఆర్ను అనేస్తున్నారు. ఇదంతా రోజూ మనం చూస్తున్నాం, వింటున్నాం. కానీ తెలంగాణ ప్రజలుగా, సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మననుంచి స్పందనెందుకు కరువైందో అర్థం కాని ప్రశ్న.
ఈ రోజు తెలంగాణకు వచ్చి గాయి చేస్తున్న నాయకులు మన రాష్ర్టానికి ఒరుగబెట్టింది ఏమిటి? గతంలో వారి పాలనలోనైనా, వర్తమానంలోనైనా వారు చేస్తున్నదేమిటి? ఒకడేమో సమస్యాత్మక ప్రాంతానికే వెళ్లి పూజలు చేస్తానంటాడు. వద్దంటే ముఖ్యమంత్రి భయపడుతున్నాడంటాడు. పాలన చేతకాదంటాడు. అదేమన్నా నిషేధిత ప్రాంతమా? అంటా డు. లేదంటే ఏక్కడైతే గొడవలు జరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అక్కడి నుంచే పాదయాత్ర చేస్తానంటాడు. సున్నిత ప్రాంతాల్లో పాదయాత్ర వద్దు అంటే ముఖ్యమంత్రిని తిడుతాడు. ఇంకొకడు నోటుకు ఓటు దొంగ లెక్కనే విద్యాసంస్థల గోడలు దూకుతాడు. ఇదేమని ప్రశ్నిస్తే ఆయనా ముఖ్యమంత్రినే తిడ్తాడు. ఇంకొకామె నోటికి ఏది వస్తే అది పద్ధతి లేకుండా మాట్లాడుతుంది. ఇదేం పద్ధతి అంటే ఆమె ముఖ్యమంత్రినే టార్గెట్ చేస్తది. ఇవన్నీ చూస్తూ పోరుబిడ్డలుగా మౌనంగానే ఉందామా? అసలింత దిగజారి మాట్లాడుతున్న వారి ఆలోచన విధానం ఏంటి ? ఎందుకింత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలుగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
దేశంలోని మిగిలిన రాష్ర్టాల్లో పాలన ఎలా ఉన్నది? ఆయా రాష్ర్టాలను పాలిస్తున్న నాయకులు ఎవరు? ఆ రాష్ర్టాల్లో వృద్ధిరేటు ఎంత ఉన్నది? ప్రజలకు అందుతున్న ఫలాలు ఎన్ని? పేద ప్రజలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, పథకాలు ఎన్ని? మరి మనం మన రాష్ట్రం లో ఎన్ని ప్రోత్సాహకాలు, పథకాలు అందుకుంటు న్నాం అని ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మిగిలిన రాష్ర్టాల్ని మన రాష్ట్రంతో పోల్చి చూస్తే అవేవీ మన దరిదాపుల్లో కూడా ఉండవన్నది నిజం. నూతన రాష్ట్రంలో కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకంటే ఎక్కువే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. వాటిని మనం అందుకుంటు న్నాం కూడా. కానీ మన కోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, పథకాలను కించపరుస్తున్న వారిని మనం పట్టించుకోం. ప్రశ్నించాల్సిన ప్రజలుగా మనం మౌనం వహిస్తే జరిగే అనర్థం కూడా మోయాల్సింది మనమే అన్న విషయాన్ని మరిచిపోకూడదు. ఇంకొక ముఖ్య విషయం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ర్టానికి ఇవ్వాల్సిన నిధులన్నింటికీ మొండి చేయి చూపెడుతున్నది. అధికారికంగా రావలసిన నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నది. అయి నా కేంద్రాన్ని ఎవరూ ప్రశ్నించరు. కనీసం ప్రశ్నించే సీఎం కేసీఆర్తో మన రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు నడవడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో నలుగురు ఎంపీలు ఉన్నారు. వారిలో ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచిన వీరితో రాష్ర్టానికి ఒరుగుతున్నదేమిటి? వారు రాష్ర్టానికి చేస్తున్న మేలు ఏంటనేది ప్రజలు గమనించాలి. బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ను ప్రశ్నిస్తాం? నిలదీస్తాం అంటున్నారు సరే.. ఎంపీలుగా ఉండి వెనుకబడ్డ జిల్లాలకు నిధులు తీసుకురానందుకు వారిని ప్రశ్నించవద్దా? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనందుకు వారిని నిల దీయవద్దా? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి ఎగనామం పెట్టినందుకు వారిని మనం సహించాలా..? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వనందుకు వారిని సన్మానించాలా? ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో జరిగిన అభివృద్ధితో నేడు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పోల్చి చూడాలి. నాడు ఏ పథకమూ అందని వారికి నేడు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతున్న విషయాన్ని గుర్తించాలి. ఉమ్మడిపాలనలో రూ. వందల్లో ఇచ్చిన పింఛన్లు నేడు రూ. వేలకు పెరిగిన విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు 24 గంటల విద్యుత్తుతో వెలుగులు చిమ్ముతున్న విషయాన్ని గ్రహించాలి.
బీజేపీ పాలిత రాష్ర్టాలకు విచ్చలవిడిగా నిధులు ఇస్తూ తెలంగాణపట్ల ఎందుకీ వివక్ష? మరి మన రాష్ట్రంలో మన ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? అడిగే బాధ్యత ప్రజలుగా మనకు లేదా? రాష్ర్టానికి ఏమాత్రం మేలు చేయని, చేతకాని ప్రజాప్రతినిధులు మనకు అవసరమా? అన్నది మనం ఆలోచించాలి.
పనిచేసే వారిని తిట్టుకుంటూ పబ్బం గడుపుకొనే వారికి చప్పట్లు కొడదామా.? లేక వాళ్ళ నోర్లు మూయి ంచి రాష్ర్టాన్ని ప్రగతి పథంలో ముందుకు నడుపుతున్న కేసీఆర్కు మద్దతుగా నిలబడదామా? ఒక సారి ఆలోచించుకోవాలి. పనిచేసే ప్రభుత్వాన్ని, పార్టీని అక్కున చేర్చుకోవడం మన బాధ్యత అనే విషయాన్ని మర్చిపోతే నష్ట పోయేది మనమే. మన కుటుంబ సభ్యులలో ఎవరైనా ఏదైనా సాధించినప్పుడు మనం అభినందిస్తాం, ప్రోత్సహిస్తాం, మరి మన రాష్ట్ర అభివృద్ధికి కారణమైన నాయకులను, పార్టీని కూడా మనం ప్రోత్సహించాలి. అభినందించాలి, ఆదరించాలి. రాష్ర్టానికి ఎలాంటి నిధులు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీని నిలదీయాల్సిందే.
అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ మీద నోరు పారేసుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వంగా మీరు ఇచ్చిన వాగ్దానాల మాటేంటి? అని నిగ్గ దీయాల్సిందే. రాష్ర్టానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపని బీజేపీ నాయకులను ప్రశ్నించాల్సిందే. కేంద్రం రాష్ర్టానికి చేస్తు న్న అన్యాయాన్ని నిలదీసి నిజాల్ని ప్రజల ముంగిట ఉంచాల్సిన సమయం ఆసన్నమైంది.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణలో జరిగిన అభివృద్ధితో నేడు తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పోల్చి చూసుకోవాలి. నాడు ఏ పథకమూ అందని వారికి నేడు ప్రతి ఇంటికి ఏదో ఒక పథకం అందుతున్న విషయాన్ని గుర్తించాలి. ఉమ్మడిపాలనలో రూ.వందల్లో ఇచ్చిన పింఛన్లు నేడు రూ. వేలకు పెరిగిన విషయాన్ని గమనించాలి. ఒకప్పుడు చీకట్లో మగ్గిన గ్రామాలు నేడు 24 గంటల విద్యుత్తుతో వెలుగులు చిమ్ముతున్న విషయాన్ని తెలుసుకోవాలి.
ఉమ్మడి పాలనలో సాగునీరు, తాగునీరు, విద్యుత్తు లేక పంటలు నష్టపోయి ఉరితాళ్లకు వేలాడిన అన్నదాతలను గుర్తుకు తెచ్చుకోవాలి. నేడు కాళేశ్వర జలాలు, మిషన్ భగీరథ నీళ్లు మన ముంగిట పారుతున్న సత్యా న్ని నలుగురికి చూపెట్టాలి. తెలంగా ణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని, ప్రవేశపెట్టిన పథకాల ను దేశమంతా గమనిస్తున్నది. అందుకే ఆయన పాలనను దేశం యావత్తు కోరుకుంటున్నది. అలాం టి పాలనాదక్షుడికి తెలంగాణ ప్రజానీకమంతా అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దేశానికంతటికీ తెలంగాణ రోల్మాడల్గా నిలుస్తున్నందుకు తెలంగాణ బిడ్డలుగా మనం గర్వపడాలి.
-గోగుల రవీందర్ రెడ్డి
95022 52229