దేశ చరిత్రలో కనీవిని ఎరుగని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అన్నివర్గాలకు న్యాయం చేసిన జనహృదయ నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఉన్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యున్నత జల వినియోగ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. బంగారు తెలంగాణ వైపు బాటలు వేస్తూనే దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. కేసీఆర్ నేతృత్వంలో మూడోసారి పార్టీ అఖండ విజయం సాధించి రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టే సమయం ఎంతో దూరం లేదనడంలో సందేహం లేదు.
తెలంగాణను అర్థం చేసుకోవడంలో కేసీఆర్ నూటికి నూరు శాతం సఫలమవుతూనే ఉన్నా రు. ఆయన విజయవంతంగా నడిపిన తెలంగాణ ఉద్య మం, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి. దమ్మున్న నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, తెలంగాణను అన్నిరకాలుగా బాగు చేస్తున్న నాయకుడు కేసీఆర్. ఆయన ఆలోచనలను, దూరదృష్టిని అర్థం చేసుకోలేకపోతే తెలంగాణ సమాజం తీవ్రంగా నష్టపోతుంది.
పరాయి పాలనలో తెలంగాణ ఎట్లా ఉండేది? ఇప్పుడు కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ అభివృద్ధి చెందిందో తెలుసుకోలేనంత, అంచనా వేయలేనంత స్థితిలో తెలంగాణ సమాజం లేదు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఇలా అన్నింటిలో దేశంలోని మిగతా రాష్ర్టాల కంటే తెలంగాణ అగ్రభాగాన ఉన్న విషయం తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ మేలు కోసం కేసీఆర్ పడుతున్న తపనను, ఆరాటాన్ని ప్రజలు స్వయం గా చూస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది పనికిమాలినవారు చేసే ప్రచారాన్ని చూసి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పేదల సంక్షేమంకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. తెలంగాణలోని వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఒకళ్లమీద ఆధారపడకూడదన్న లక్ష్యంతో కేసీఆర్ ఆసరా పింఛన్‌ను ప్రవేశపెట్టారు. ఒకప్పుడు రూ.200లకు మించని పింఛన్ ఈ రోజు వేలకు పెరిగింది. పేదింటి ఆడపిల్ల పెండ్లికి నేనున్నానంటూ కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో కొండం త భరోసా ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను పెంచడానికి కేసీఆర్ కిట్‌ను ప్రవేశపెట్టి ప్రభుత్వ వైద్యం పట్ల విశ్వాసాన్ని పెంచారు ముఖ్యమంత్రి కేసీఆర్.
రైతు సర్కార్‌గా పేరువడ్డ తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి పదివేలు అందిస్తున్నది. అర్ధాంతరంగా రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి రూ.5 లక్షల రైతు బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో సాగునీటి కొరత లేకుండా చూస్తూ ఎరువులు, పురుగు మందులు అన్నింట్లోనూ రాయితీలందిస్తున్నది. నాడు ఎప్పుడు కూలుతాయో తెలియని సర్కారు బడులను తీర్చిదిద్ది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉచిత విద్య, ఉచిత పుస్తకాలు అందిస్తున్నది. మరొకవైపు గురుకులాల సంఖ్యను పెంచి లక్షల మంది విద్యార్థులకు విద్యాసౌకర్యం కల్పిస్తున్నది. గ్రామాల్లో పల్లెపకృతి వనాలు, వైకుంఠధామాలు, డంప్‌యార్డులు నిర్మించి గ్రామాలను కాలుష్యరహితంగా తీర్చిదిద్దారు. ఇలా తెలంగాణ రాకముందు, వచ్చాక పరిస్థితులను బేరీజు వేసుకుంటే అభివృద్ధి కండ్లముందే కనిపిస్తుంది. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో ఏదో ఒకటి అందని ఇల్లు తెలంగాణలో లేదంటే అతిశయోక్తికాదు. ఎన్నికలు రాగానే ఎవరెవరో వస్తుంటారు పోతుంటారు. కానీ మనకోసం ఆలోచించే నాయకుడికి మాత్రమే మన పట్ల, మన ప్రాంతం పట్ల ఆర్తి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాకే అన్నివర్గాల ప్రజలకు గౌరవం పెరిగిందనే విష యం గుర్తించాలి. అర్థం, పర్థం లేకుం డా విమర్శించేవాళ్లకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి.
ఒకప్పుడు తెలంగాణ అంటే నీళ్లు లేక ఎండి బీళ్లు పడ్డ భూములు. పంటలు పండక ఎండిన పంటలు. పెట్టుబడి ఎళ్లక ఊరితాళ్లకు వేలాడిన రైతుల జీవితాలు. వ్యవసాయం అంటే దండుగ అనే దశ నుంచి ఈ రోజు కేసీఆర్ పాలనలో పండుగ అనే దశకు తీసుకు రావడం జరిగింది. అందుకే ఇప్పుడు తెలంగాణ అంటే అభివృద్ధ్ది, తెలంగా ణ అంటే సంక్షేమం. తెలంగాణ అంటే పారి శ్రామిక ప్రగతికి నిదర్శనం. తెలంగాణ అంటే సబ్బండ వర్గాల ప్రభుత్వం.
అంతేకాదు ఒకప్పుడు వర్షాల కోసం మొగులు దిక్కు చూసే పరిస్థితి నేడు ఎండకాలం కూడా మత్తడి దుంకుతున్న చెరువులు. అందుకే ఇప్పుడు తెలంగాణ అంటే నీళ్ల ప్రపంచం. తెలంగాణ అంటే వ్యవసాయం. రైతుబంధు, రైతు బీమా. తెలంగాణ అంటే ఇప్పుడు దళితబంధు, తెలంగాణ సబ్బండ వర్గాల ఆత్మభవనాల నిర్మాణం.
నీళ్లు, నియామకాలు, నిధులు అన్న నినాదాన్ని నిజం చేసిన విజేత కేసీఆర్. ఏ రకంగా చూసినా, ఏ రంగంలో చూసినా తెలంగాణ అంటే ఇప్పుడు దేశానికి ఆదర్శం. అందుకే దేశమంతా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తు న్నది. మహారాష్ట్ర మొదలు అన్ని రాష్ర్టాలు కేసీఆర్ నాయకత్వం కోరుకుంటున్నాయి. తెలంగాణ అభివృద్ధి స్ఫూర్తితో దేశం వైపు దూసుకు పోతున్నది బీ ఆర్ఎస్. రానున్న రోజుల్లో దేశమంతా గులాబీ గుబాళింపులే.
– ఆలేటి రమేశ్ 99487 98982