స్వరాష్ట్ర కలతో పురుడు పోసుకున్న పునాది
స్వాభిమానం నింపుకొన్న ఉద్యమ కాణాచి
జలదృశ్యంలో ఆవిష్కృతమైన ఆశయసౌధం
రెండు దశాబ్దాల చారిత్రక ప్రయాణ తేజం
అడుగు అడుగున స్ఫూర్తి నింపిన నాయకత్వం
అణువణువున ఉత్తేజం మొలిచిన ఉద్యమ తత్తం
కోటి గొంతుకలు ఒక్కటైన తెలంగాణ రణ నినాదం
నేటి తరాలకు స్ఫూర్తి చాటిన గులాబీ కేంద్రం
అణచివేతకు ఎదురునిలిచి ఎదిరించిన నైజం
తెలంగాణ ఆత్మాభిమానం ఆవిష్కరించిన ఇజం
రాదు రాదంటూ అడ్డుకున్న కుహనా సమైక్య గారడీ
దీక్షబూని దేశమంతటిని కదిలించిన గులాబీ సారథి
అరవై ఏండ్ల కలకు ఆయువు పోసిన సత్యాగ్రహి
నేటి బంగారు తెలంగాణ కార్య సాధకుడోయి
మన యాసకు మన బాసకు పట్టంగట్టిన వైనం
కొత్త రెక్కలొచ్చి పాలపిట్ట ఎగిరిన తరుణం
సొంత రాష్ట్ర కల నెరవేర్చిన గులాబీ జెండా
సంకల్ప సాధకుడి రూపమే మన గుండెల నిండా..!
-రామకృష్ణ మనిమద్దె
94943 53828