కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నది. అందులో భాగంగానే మనీష్ సిసోడియా లాంటి వ్యక్తులు అకారణంగా జైల్లో మగ్గుతున్నారు. ఇప్పటికే మా నాయకులపై 170 అవినీతి కేసులు మోపింది. అందులో 140 తప్పుడు కేసులని కోర్టు తేల్చడం కేంద్ర ప్రభుత్వ పక్షపాతాన్ని తెలియజేస్తున్నది. మా పార్టీని తుదముట్టించడమే బీజేపీ లక్ష్యం అనుకుంటా.!