BJP | కేసీఆర్ అంటే ఒక శక్తి. నాలుగున్నర కోట్ల ప్రజల గొంతుకలను ఒకటి చేసి, ఊరు వాడను ఏకం చేసిన ప్రజానాయకుడు. తన ప్రాణాలను అడ్డుపెట్టి ఢిల్లీ ప్రభుత్వ మెడలు వంచి తెలంగాణను సాధించిన మహాశక్తి కేసీఆర్. సాధించిన రాష్ర్టాన్ని జలహారం చేసి, పచ్చని పొలాలతో, ధాన్యరాశులతో దేదీప్యమానంగా మార్చిన తెలంగాణ జాతిపిత మన కేసీఆర్. ఆయన దూరదృష్టిని, తెలంగాణ అభివృద్ధిని, కేసీఆర్‌కు ప్రజల మీదున్న ప్రేమను చూసి తట్టుకోలేక బీజేపీ కేంద్ర, రాష్ట్ర నాయకులు అర్థం లేని ఆరోపణలు, పసలేని ప్రసంగాలతో తెలంగాణ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారు.
విభజన చట్టంలోని హామీలను ఒక్కటంటే ఒక్కటి తీర్చలేదు మోదీ ప్రభుత్వం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదు. కాజీ పేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు. తెలంగాణకు ఒక్క వైద్య కళాశాల ఇవ్వ లేదు. ఒక్క నవోదయ ఇవ్వలేదు. ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ అండ్ సైన్స్ రిసెర్చ్ ఎడ్యుకేషన్ ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే మోదీ తెలంగాణకు చేసింది జీరో. బీజేపీ పాలిత రాష్ర్టాల కంటే తెలంగాణ తలసరి ఆదాయంలో ముం దున్నది కాదని నిరూపించగలరా మోదీ భజన బ్యాచ్. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎంతో అభివృద్ధి చేశాం, ఇన్ని పథకాలు పెట్టాం. రేపు అధి కారంలోకి వస్తే తెలంగాణలోనూ చేస్తామని చెప్పే ధైర్యం లేదు బీజేపీ నాయకులకు. కానీ ఎలక్షన్లు రాగానే తెలంగాణ మీద కపట ప్రేమ చూపి స్తూ కేసీఆర్ మీద పిచ్చి పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ మిడతల దండు. ఈ మిడతల దండును ప్రజలు నమ్మట్లేదని కేంద్ర దండు నాయకులైన మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, జేపీనడ్డా, తెలంగాణ మీద పడి అసత్య ఆరోపణలతో, పచ్చి అబద్ధాలతో దేశ అభివృద్ధిని పక్కన పెట్టి కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కానీ కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోతున్నారు. పదవి కాంక్షతో కేసీఆర్‌ను అప్రతిష్ట పాలు చేయడానికి ఎన్ని ఆరోపణలు చేసినా తెలం గాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంటుంది.
మరొక ఆరోపణ కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేయలేదు. పోనీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తారా. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితుల మీద, దళిత మహిళల మీద హత్యలు, అత్యా చారాలు జరుగుతున్నాయి. దళితులు గుడిలోకి వస్తే గుడిని శుభ్రం చేసే ఆచారాలను పాటిస్తున్నది బీజేపీ. దళిత రాష్ట్రపతిని అవమానించిన చరిత్ర బీజేపీది. తెలంగాణకు తలమానికమైన నూతన సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించినవారు సీఎం కేసీఆర్. భావితరాలకు ఆ మహనీయుని గొప్పతనం తెలిసేలాగ 125 అడుగుల విగ్రహాన్ని ప్రతి ష్ఠించి, దళితుల సంక్షేమం కోసం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్న అభినవ అంబేద్కర్ కేసీఆర్.
మరొక ఆరోపణ కుటుంబ పాలన. బుద్ధిలేని బీజేపీ నాయకుల్లారా దొడ్డి దారిన కేసీఆర్ తన కుటుంబానికి పదవులు ఇవ్వలేదు. ప్రజలకు సేవ చేసి, ప్రజల మనస్సును దోచుకొని, ప్రజాస్వామ్య బద్ధంగా పోటీ చేసి గెలిచారు. దీన్ని కుటుంబ పాలన అంటే ఎలా. పోనీ ఇది కుటుంబ పాలనే అనుకుందాం. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ ఎమ్మెల్యే. కర్ణాటక సీఎం యడియూరప్ప కుమారుడు విజయేంద్ర బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మరో కుమారుడు రాఘవేంద్ర ఎంపీ. మాజీ సీఎం వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ ఎంపీ. హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్‌కుమార్ ధుమాల్ కుమారుడు అనురాగ్ ఠాకూర్ కేంద్ర మంత్రి. ఎంపీ మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ ఎంపీ. తేజస్వి సూర్య మేనమామ రవి సుబ్రమణ్య ఎమ్మెల్యే. మాజీ ప్రధాని దేవెగౌడ తన కుమారుడైన కుమారస్వామిని ముఖ్యమంత్రి చేశారు. నిన్నటికి నిన్న కర్ణాటకలో దేవెగౌడ కుటుంబం నుంచి కుమా రస్వామిని ఎన్డీఏలో చేర్చుకున్నారు. చంద్రబాబు నాయుడు కొడుకు లోకేశ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనుకోవటం లేదా. ప్రకాశ్‌సింగ్ బాదల్ కొడుకును ఉపముఖ్యమంత్రిని చేయలేదా. ఇవ్వన్ని కుటుంబ పాలన కిందకు రావా? కేవలం బీజేపీ తప్పుడు సిద్ధాంతాలను ప్రశ్నించే కేసీఆర్ కుటుంబమొక్కటే కుటుంబ పాలన చేస్తున్నదా?
ఎప్పుడూ కేసీఆర్ మీద పడి ఏడవడమే తప్ప ఈ ప్రాంతానికి ఈ పని చేస్తం అని చెప్పి ఓట్లు అడిగే దమ్ము, ధైర్యం లేని దండుపాళ్యం బ్యాచ్ బీజేపీ నాయకులు. మరోవైపు బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని ఆరోపిస్తున్నారు. ఒక్కటే అయితే తప్పేంటి. తెలంగాణలో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి జీవిస్తారు. మొన్నటికి మొన్న వినాయక నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి ఒకటే రోజు రావడంతో ముస్లిం మత పెద్దలు వారికి వారే నిర్ణయం తీసుకొని వారి పండుగను వాయిదా వేసుకున్నారు. బీజేపీ ఎజెండా ఒక్కటే హిందూ, ముస్లింల మధ్య మతకల్లోహాలు సృష్టించి, ఘర్షణలు రేపి ఓట్లు దండు కోవాలని. కానీ ఆ పప్పులు తెలంగాణలో ఉడుకవనే సంగతి మోదీకి, ఆయన భజన బ్యాచ్‌కి తెలియదు.
మరోవైపు బీజేపీకి బీ టీం బీఆర్ఎస్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తున్నది. నిజానికి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ చేయాల్సిన పనిని బీఆర్ఎస్ చేస్తుంటే ఇలాంటి ఆరోపణలు చేయటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్‌తో పద్నాలుగేండ్లు పోరాడిన చరిత్ర బీఆర్ఎస్ది. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో పోరాడుతున్న చరిత్ర కూడా బీఆర్ఎస్దే. దీన్నిబట్టి ఎవరు ఎవరికీ ఏ టీమో ప్రజలే నిర్ణయిస్తారు.
తెలంగాణ ప్రజలు విజ్ఞులు, పార్లమెంట్ సాక్షిగా సాక్షాత్తు ప్రధాని మాట్లాడిన మాటలను మర్చిపోలేరు. ‘తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు’ అని వేలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలను అపహాస్యం చేశారు మోదీ. అలాంటి నాయకులకు తెలం గాణలో ఓటు అడిగే హక్కులేదు. బీజేపీ నాయకులు పొర్లుదండాలు పెడుతూ తిరిగినా తెలంగాణలో అధి కారంలోకి వచ్చే అవకాశం లేనే లేదు. మొన్న కేసీఆర్ మ్యానిఫెస్టో విడుదల చేసిన రోజే వార్ వన్ సైడ్ అని డిసైడ్ అయింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎంత విష ప్రచారం చేసినా మూ డోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం రావ డం, సీఎం కేసీఆర్ హాట్రిక్ కొట్టటం ఖాయం.
-రాజేష్ నాయక్
96035 79115