బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యతిరేక వర్గానికి రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్‌తో వార్నింగ్ ఇప్పించగలిగామని ఆయన వర్గం సంబరపడుతుండగా, వ్యతిరేక వర్గమేమో ఈ విషయాన్ని ఢిల్లీ దాకా తీసుకెళ్లడంతో సక్సెస్ అయ్యామని సంతోష పడుతున్నారు. బండి సంజయ్ సీనియర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆయన వ్యతిరేకులు ఆగ్రహంగా ఉన్నారు. వీరంతా ఏకమై కరీంనగర్, పెద్దపల్లి, హైదరాబాద్‌లో చింతన్ బైఠక్ వేసి చర్చించాకే.. కరీంనగర్, హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. వీరిని మొదట్లోనే కట్టడి చేయకపోతే తన చాప కిందకు నీళ్లు తెచ్చేలా ఉన్నారని బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి అసమ్మతీయులకు వార్నింగ్ ఇప్పించారు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ, వారంతా నెక్స్ మీటింగ్ ఏకంగా ఢిల్లీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వినికిడి.
-వెల్జాల