ఇండియా గుండెల మీద
స్టెతస్కోప్ పెట్టి చూశాను
పరీక్షగా..
నగ్నంగా ఉన్న చెవుల శరీరాలకు
అగ్నిలా చురకలు తగిలిన
సెగల అలజడి నాలో..
ఇది రోగం కాదు ఘోరం
ఇది పాపం కాదు శాపం
ప్లీజ్… క్విక్…
అందరూ ఒక్కొక్కరే
ముందుకు రండి!
చుక్కా చుక్కా కలిపి
చైతన్యం టానిక్ తీసుకురండి
ఈ ట్రీట్మెంటే దీనికి కరెక్టు జడ్జ్మెంట్!
నేను డాక్టర్ని కాను బ్రదర్..
మీలోని అజ్ఙానం, సోమరితనం..
బీడు భూముల్ని దున్నాలని
పరితపించే ట్రాక్టర్ని…
అలిశెట్టి ప్రభాకర్
(జనవరి 12-అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి సందర్భంగా..)