‘తెలంగాణ మాడల్..’ ఇదిప్పుడు అందరి నోటా నానుతున్న మాట. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ప్రణాళిక తీసుకొస్తానన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న మాట. రెండింటి అర్థాలూ ఒక్కటే. దృఢమైన రాజకీయ సంకల్పం, సాహసంతో సుస్థిరాభివృద్ధి సాధించాలన్నదే ఈ మాడల్, ప్రణాళికల సారాంశం. తొలుత ప్రాధాన్యరంగాలను తీసుకొని వాటిని సాధ్యమైనంత వరకు సమస్యలు లేనివిగా తీర్చిదిద్ది, భావితరాలకు అందించడం వీటి ఆశయం.
మొట్టమొదట ప్రాథమికరంగమైన వ్యవసాయంలో తెలంగాణ చెప్పుకోదగిన ప్రగతి సాధించింది. సాగునీటి పారుదలలో అద్భుతాలు సృష్టించింది. అం దులో భాగమే కాళేశ్వరం మెగా ప్రాజెక్టు. పల్ల పు ప్రాంతం నుంచి ఎగువకు నీరు పారింది. ప్రధాన నది అయిన గోదావరి నుంచి దాని ఉపనది అయిన మానేరులోకి నీరు చేరింది. ఇదొక అపురూప సన్నివేశం. ఒకేసారి రూ.లక్ష కోట్ల వ్యయం చేసి అత్యంత భారీ, బహుళార్థసాధక ప్రాజెక్టు చేపట్టడం పెద్ద సాహసం. దీం తో పంటల దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. తెలంగాణలో ఆకలి, కరువు ఇక లేనట్టే. ఆకలితీరింది కాబట్టి ఆరోగ్యరంగం ఆధునికీకరణపై కేసీఆర్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది.
దీన్నికూడా సమస్యలు లేని రంగంగా మార్చాలంటే, మానవ వనరుల లభ్యత ఉండాలి. డాక్టర్ల కొరత లేకుం డా చూడాలి. అందులో భాగమే ఒకేసారి కొత్తగా 8 ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రారంభం. ఇవన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటైనవే. ప్రభు త్వం ఆధ్వర్యంలో వైద్య కళాశాలలుంటే ఎన్నో ప్రయోజనాలుం టా యి. మొట్టమొదటిది.. ఫీజుల భారం తక్కువ. ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో చదువుల ఖర్చులు రూ.కోట్లు దాటాయి. అక్కడ చదివినవారికి వ్యాపార దృక్పథంతో కాకుండా సేవాభావంతో పనిచేయాలని చెప్పడం తప్పే అవుతుంది.
ప్రభుత్వ కాలేజీల్లో అయితే ఆ భారాన్ని సర్కారే భరిస్తుంది. తద్వారా విద్యార్థులు సమాజం పట్ల కొంత బాధ్యత కలిగి ఉండే అవకాశం ఉంటుంది. అదీగాక, రిజర్వేషన్లు పక్కాగా అమలవుతాయి. తద్వారా సామాజిక న్యాయం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాలవారు కూడా ఎంబీబీఎస్ చదువుకోవచ్చు. చదువుల కోసం ఉక్రెయిన్కో, చైనా కో వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ వైద్య కళాశాలల కారణంగా తక్షణ ప్రయోజనం మరొకటి ఉంది. ఆ కాలేజీలకు అనుబంధంగా కనీసం వంద పడకల దవాఖానలు ఏర్పాటవుతాయి. మారుమూల ప్రాంతాల ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అం దుతాయి. అన్నింటి కీ హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం ఉండ దు.
రానున్న రెండేండ్లలో మరో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. జిల్లాకు ఒకటి చొప్పున మొత్తం 33 వైద్య కళాశాలలతో తెలంగాణ స్వరూపమే మారిపోతుంది. భారీ ఎత్తున ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రారంభం వల్ల మరో పదేండ్లలో రాష్ట్రంలో ఎక్కడా వైద్యుల కొరత అన్న మా టే వినిపించకపోవచ్చు. ఒక్క డాక్టర్లేనా? ఇతర సిబ్బందిని తయారు చేయడానికి కూడా ఏర్పా ట్లు జరుగుతున్నాయి. ఈ విధంగా తెలంగాణలో వైద్య సదుపాయాలు సంతృప్తికరస్థాయికి చేరుకుంటాయి. వైద్యరంగం దాదాపుగా సమస్యలు లేనిదిగా మారుతుంది. ఇదే తెలంగాణ మాడల్.
ఏ దేశానికైనా, ప్రాంతానికైనా ఆరోగ్యకర సమాజ నిర్మాణం అత్యవసరం. ఉదాహరణ కు 1960లలో క్యూబాలో జరిగిందిదే. ఎక్కడికక్కడ అందుబాటులో ఉండేవిధంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేశారు. చౌకగా వైద్యం లభించింది. క్యూబా ప్రజల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడింది. ఇత ర రంగాల్లోనూ అగ్రరాజ్యాన్ని సవాలు చేసే లా ఎదిగింది క్యూబా. వైద్య ఖర్చుల కోసం అప్పుల పాలవడం, ఆస్తులు అమ్ముకోవడం వంటివి ప్రస్తుత సమాజ దుస్థితికి ఉదాహరణలు. తెలంగాణలో దీన్ని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగానే ఆరోగ్యరంగంలో అనేక మార్పులు కండ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసింది. జ్వరం, తలనొప్పి వంటివాటికి కూ డా పెద్ద దవాఖానలకు వెళ్లాల్సిన బాధ దీంతో తప్పింది. ఈ విధంగా గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా వైద్యరంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నది తెలంగాణ ప్రభుత్వం.
ఆహారం, ఆరోగ్యం.. ఈ రెండు రంగాలూ కొరత లేనివిగా మారితే.. ఆ ఊహే అద్భుతం గా ఉంటుంది. అది కలేమీ కాదు. తెలంగాణ లో ఈ కల ఇప్పుడు సాకారమవుతున్నది. ఈ రెండింటి తర్వాత ప్రభుత్వం చేపట్టనున్న మరో భారీ కార్యాచరణ.. అద్దం లాంటి రోడ్లు. రహదారులు అంటే నాగరికతకు చిహ్నాలు. అందుకే దీన్ని కూ డా సమస్యలు లేని రంగంగా మార్చి భావి తరాలకు అందించాలని ముఖ్యమం త్రి భావిస్తున్నారు. ఇదీ తెలంగాణ మాడ ల్. ప్రగతి కంటికి కనిపించాలి. దాన్ని అందరూ అనుభవించాలి. జీవన ప్రమాణాల్లో మార్పులు కనిపించాలి. సామాజిక మార్పునకు దోహ దం చేయాలి. ఇదే మాడల్ ఇప్పుడు దేశవ్యాప్తం కావాల్సిన అవసరం ఉన్నది.
ఆహారం, ఆరోగ్యం.. ఈ రెండు రంగాలూ కొరత లేనివిగా మారితే.. ఆ ఊహే అద్భుతం గా ఉంటుంది. అది కలేమీ కాదు. తెలంగాణ లో ఈ కల ఇప్పుడు సాకారమవుతున్నది. ఈ రెండింటి తర్వాత ప్రభుత్వం చేపట్టనున్న మరో భారీ కార్యాచరణ.. అద్దం లాంటి రోడ్లు. రహదారులు అంటే నాగరికతకు చిహ్నాలు. అందుకే దీన్ని కూడా సమస్యలు లేని రంగంగా మార్చి భావి తరాలకు అందించాలని ముఖ్యమం త్రి భావిస్తున్నారు. ఇదీ తెలంగాణ మాడల్.
గోసుల శ్రీనివాస్ యాదవ్ : 98498 16817