అవును సోయి మనకుండాలె
అతను చేసిన అప్పంతా
మన ఆకలి దప్పులు తీర్చడానికే!
రైతు లేని రాజ్యాన్ని కలగన్నోడు
రాజ్య బహిష్కృతుడయిండు
కృషీవలుడు సామూహిక బువ్వ కుండ!
రుణమాఫీ ఎన్నటికీ
రుణాను బంధ విమోచనం కాదు
మనకొకింత ఉపశమనం మాత్రమే!
నేలనే నమ్ముకున్న వాడు
అప్పిచ్చిన బ్యాంకుల ముంచి
దేశాన్ని విడిచి పారిపోడు!
దేశభక్తి నినాదాల్లో ఉండదు
నాగేటి చాలల్లో పంట పొలాల్లో
నవోదయమై మొలకెత్తుతది!
విద్వేషపు పంటలకు తావులేని చోట
ఆకుపచ్చని లోయలూ
పసిడి పంటల మైదానాలూ
విస్తరిస్తాయి!!
– కోట్ల వెంకటేశ్వరరెడ్డి 94402 33261