భూమి తెలంగాణ మనది
కామిత ఫలసంపదలిడు కాళేశ్వరమీ
కోమల ధాన్యపు రాసుల
సీమగ పరిమార్చి వేసె సిరులిడెలీలన్
ఖాళీ చెఱువులు కుంటలు
వేళకు ఏ వాన రాదు వీడదు క్షామం
ఖాళీ కడుపుల వేదన
కాళేశ్వరు చెవులు తాక గంగను విడిచెన్.
భాగీరథి దీవించెనొ
నాగాభరణుడు అతనికి నచ్చిన వేల్పో
వేగమె జీవ జలమ్ముల
బాగగురథి కేసీయారు ప్రజలను చేరెన్.
ఒక్కొక ఊరూ ఇల్లూ
చుక్కైనా నీరు లేక సుక్కిన వేళన్
దిక్కై భగీరథ జల
మెక్కడ చూసిన గలగల ఇల్లూ వాడా
కరకర ఎండిన ఊర్లకు
పరుగిడె ప్రతి ఇంట నీరు భాగీరథియై
వరమడిగెనొ కేసీయార్
పరమేశుడు గంగ విడిచె పార్వతి నవ్వెన్.
– వ్యాఘ్రగిరి