కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారింది అన్నరు 2024 మార్చి 5న సంగారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్‌పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్‌స్ట్రైక్స్ ఉంటయని హెచ్చరించిన్రు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మరింత రెచ్చిపోయి రాష్ట్రంలో రాహుల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నరని, రియల్ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల నుంచి డబ్బులు వసూలు చేసి రాహుల్‌కు పంపుతున్నరని మండిపడ్డరు.
ప్రధాని హెచ్చరికలకు రెండేండ్లు నిండినై. కేరళ ఎన్నికల కోసం 1000 కోట్లు ఇస్తనని పబ్లిగ్గా ప్రకటించిండు.. రేవంత్‌రెడ్డి. గతంలో హిమాచల్‌ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, బీహార్ ఎన్నికలకు కూడా ‘తెలంగాణ ఏటీఎం’ నుంచే ధనప్రవాహం జరిగింది. అయినా రేవంత్‌పై ఎలాంటి స్ట్రైక్స్ చేయలేదు ప్రధాని. రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులు, మంత్రులు సహా సీఎం అవినీతి చిట్టా తన దగ్గర ఉన్నదని కేంద్రమంత్రి బండి సంజయ్ సెలవిచ్చిన్రు. తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు ‘ఏటీఎం’ దగ్గర ఎందుకు కాపలా ఉండడం లేదో మోదీకే తెలియాలి!
దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇతరత్రా ఆర్థికావసరాలు, చివరకు ఏఐసీసీ కార్యాలయ ఉద్యోగుల జీతభత్యాలు కూడా తెలంగాణ ఏటీఎం మోస్తున్నది. అయినా, తప్పంతా దుర్యోధనుడిపై నెట్టి ధృతరాష్ట్రుడిని మాత్రం ‘పాపం గుడ్డి రాజు’ అంటూ సానుభూతి చూపిస్తున్నరు ‘ప్రజాస్వామ్య పరిరక్షకులు’. రాహుల్ చేతిలోని రాజ్యాంగ ప్రతి చూసి మోసపోతున్నరు. ‘ప్రజా పాలన’, ‘స్వేచ్చా వాయువుల’ ముసుగులో రంగనాథ్ గారి హైడ్రా పేద బతుకులను ఎలా రోడ్డుపాలు చేసిందో మనం చూస్తనే ఉన్నం. అయినా ఈ సోకాల్డ్ మేధావులలో చలనం రాలేదు.
తాజాగా జరుగుతున్న దారుణం ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఎనిమిది ఏండ్లుగా భూదాన భూమిలో నివసిస్తున్న పేదల గుడిసెల కూల్చివేతకు రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు కదిలినై. మూడు వేల మంది పోలీసుల పహారాలో ఈ దారుణం జరిగింది. విషయం స్పష్టం సీఎం కనుసన్నల్లో ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ మంత్రులు కలిసి చేయబూనుతున్న ఈ భూదోపిడీ కూడా ‘ఏటీఎం’ నింపడానికే. ఇది స్ఫటిక స్పష్టంగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని మేపడానికే!
హైదరాబాద్ ‘మధు రిడ్జ్’ను కూల్చి, గాంధీ విగ్రహం ఏర్పాటు పేర కోట్లాది రూపాయలు దండుకుని రాహుల్ గాం ధీ కోసం ఏటీఎంను నింపాలని రేవంత్ తాజా ప్రయత్నం. మూ సీ సుందరీకరణ, ఫోర్త్ సిటీ, లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్, ఎగ్గొడుతున్న రైతుభరోసా, చెయ్యను పొమ్మంటున్న రుణమాఫీ ఒక్కటేమిటి, రేవంత్‌రెడ్డి తలపెట్టిన ప్రతి పని వెనుకా ఉన్నది ఈ ‘దోపిడీ ఫిలాసఫీ’యే. దోపిడీ సొమ్ములో తన ‘కట్’ తాను తీసుకుని, పక్కలో బల్లేలలాంటి కొందరు మంత్రులు, నోరున్న ఎమ్మెల్యేల ‘కట్’ వారికి ఇచ్చి; మిగిలినదంతా రాహుల్ కోసం ఏటీఎం నింపడం తప్ప మరో కార్యక్రమం లేదు రేవంత్‌రెడ్డికి. క్యాబినెట్ సమావేశం కూడా ఢిల్లీలో జరిపిన్రు అంటే, మొత్తం మంత్రివర్గానికి టార్గెట్లు ఇచ్చి, వసూళ్ల గురించి ‘గట్టిగానే’ చెప్పినట్టు అనిపిస్తున్నది.!
నిన్నటికి నిన్న ‘కమీషన్ల ఐఏఎస్’పై మంత్రి చెప్పినా చర్యలు తీసుకోలేదు సీఎం అంటూ వారి అనుంగు మీడియా రాసింది. ఏ కారణం వల్ల చర్యలు లేవో ఊహించడానికి మనమేమీ సామాజిక శాస్త్రజ్ఞులం కానక్కరలేదు. కమీషన్లలో తన వాటా, రాహుల్ వాటా చెల్లించి ఏమైనా చేసుకొమ్మని అలిఖిత ఆదేశాలే కారణం! రాష్ట్రమంతా నడిచే తంతు ఒక్కటే రాహుల్ కోసం ఏటీఎం నింపడం. ఏం చేసినా వెనుకేసుకు వచ్చేందుకు మీడియాకు ఇంత చిల్లర పడేయడం. డీల్స్ కుదరక ఎవరైనా అడపాదడపా గొంతు ఎత్తినట్టు చేస్తే, తమను అధికారంలోకి తెచ్చిన మాయగాళ్లను ఈ రోజు తనే అసహనంతో అరెస్టులు చేయించడం. ఇది తప్ప మరేమీ లేదు.
ఒక వైపు లూటీ; మరోవైపు… దేశంలోని మిగతారాష్ర్టాలు తమకేమి కావాలో కేంద్రంతో లాబీ చేస్తూ ఉంటే తెలంగాణలో మాత్రం ఎంక్వయిరీలు, కక్ష సాధింపులు, అలసత్వం, నిర్లక్ష్యం, పాలన పట్టనితనం సాగుతున్నది. మెస్సీతో ఫుట్‌బాల్ ఆటల చిత్రాలు, కోట్లాది రూపాయల ప్రజా ధనంతో కొత్త క్యాంప్ ఆఫీసులు, మనుమడి కోసం ఫుట్‌బాల్ గ్రౌండ్, కొత్తగా మొలుస్తున్న కంచెలు, కనీవినీ ఎరుగని బూతులు, కక్ష రాజకీయాలు! ఇదే రేవంత్ పాలనలో మెరుపులు. ఇక ఆయన గారిని అన్నింటా వెనుకేసుకుని రావడానికి కొత్త పలుకుల చిలుక ప్రయాస పడుతున్నది.
రాష్ర్టాన్ని రావణకాష్టం చేసిన మనిషి తను మాత్రం నాయకత్వ పాఠాలు నేర్చుకోవడానికి హార్వర్డ్ పోవడం అన్నిటికీ పరాకాష్టం! మీకు ఉద్యోగాలు ఇవ్వలేను, మీకు ఇండ్లు ఇవ్వలేను, మీకు భూములు ఇవ్వలేను అంటూ పబ్లిగ్గానే చెప్తున్న ముఖ్యమంత్రి, అంతే పబ్లిక్‌గా కాంగ్రెస్ కుటుంబానికి వెయ్యి కోట్లు ఇస్తా అని ఎట్లా చెప్పగలడు? ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు; నా ఇచ్చయేగాక నాకేటి వెరపు’ అనే కదా? ఈ బరితెగింపునే సోషల్ మీడియాలోనూ, క్షేత్రస్థాయిలోనూ బీఆర్ఎస్ అడుగుతున్నది కాబట్టే, కేసీఆర్ కుటుంబ పాలన, కేసీఆర్ అవినీతి అంటూ అదే అరిగిపోయిన రికార్డు వేయడం పరిపాటిగా మారిపోయింది. మేధో గంగిరెద్దులు అందుకు తలలూపడం! ఎంత విషాదం.
మన ఇంట్లో బాలింతను ఎంత జాగ్రత్తగా చూ సుకుంటం. గర్భం దాల్చిన ప్పటి నుంచి ప్రసవం తర్వాత దవాఖాన నుంచి తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేదాకా, అనంతరం కూడా వారి ఆరోగ్యానికి పూచీ పడే ‘కేసీఆర్ కిట్’ను ఆపేస్తరా? అంటూ ఆగ్రహించారు ఆ మధ్య కేసీఆర్‌ను కలిసినప్పుడు. ఆ మాటల్లో అనంతమైన ప్రేమ కనబడింది జీవనదాతలైన తల్లులపై. త ల్లుల క్షేమం గురించి కేసీఆర్ లోతుగా ఆలోచిస్తారు కాబట్టే… పంట పండడం గురించి కూడా అంతే తపన ఆయనది.
ఇన్పుట్ సబ్సిడీ (రైతు బంధు) దగ్గర మొదలుపెట్టి, నిరంతర విద్యుత్తు, పొట్ట నిండా నీళ్లు (ఈ పద ప్రయోగం ఆయనదే!), యూరియా అందుబాటు, పంట కొనుగోళ్లు, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పరిహారం, ప్రమాద బీమా వరకూ రైతు సమగ్ర సంక్షేమం కేసీఆర్‌కు ప్రాణ సమానం. అందుకే… ‘రైతు బంధు ఆపేస్తే ఎట్లా? యూరి యా కోసం తన్నులాటలా? మన మీద కోపంతో రైతుకు నీళ్లు అందకుండా చేస్తరా? మన నీళ్లు ఆంధ్రాకు ధారాదత్తం చేస్తరా? మనం సావాల్నా? తమ పంట కొనండని రైతులు అసెంబ్లీ ముట్టడి చేసే పరిస్థితులు దారుణం కాదా?’ అంటూ నిప్పులు చెరిగిన్రు.
అందులో అన్నదాతలైన రైతులపై అనంతమైన ప్రేమ కనపడింది. ప్రజల గురించి ప్రతిపక్ష నాయకుడు అంతలా బాధ్యత చూపుతూ బాధ పడుతూ ఉంటే… అధికార పార్టీ ఇసుమంతయినా ప్రజల పట్ల ఆలోచన చేయడం లేదు. సీఎం చేనులో మేస్తుంటే… మంత్రివర్గం గట్టున మేస్తుందా? అందరూ కలిసి ‘ప్రజా ఏటీఎం’ను కొల్లగొడుతూ రాహుల్‌ను మేపుతున్నారు.
ఏటీఎం దొంగల వేల కోట్ల దోపిడీ వివరాలు కండ్లు బైర్లు కమ్మేట్టున్నయి. ఎగ్గొట్టిన రైతు భరోసా డబ్బులు 25 వేల కోట్లు; మహిళలకు రూ.2,500 హామీ కింద ఒక్కొక్కరికి రూ. 62,500, వృద్ధులకు పెన్షన్ నెలకు రూ.4 వేల హామీ కింద ఒక్కొక్కరికి రూ.50 వేలు, వికలాంగులకు పెన్షన్ రూ.50 వేలు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, విద్యార్థినులకు స్కూటీ, విద్య భరోసా కింద ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షలు, ఉపాధి హామీ కూలీకీ ఒక్కొక్కరికి రూ.24 వేల బాకీ, ఆటో కార్మికులు ఒక్కొక్కరికి రూ.24 వేల బాకీ, ఫీజు రీయింబర్స్మెంట్ రూ.8 వేల కోట్లు, రుణమాఫీ కింద రూ.2 లక్షలు, పంట బోనస్, హామీలు కలిపి నాలుగు పంటలకు ప్రతి ఎకరాకు రూ.50,000. ఇలా ఇవీ పోయినేడాది డిసెంబర్ వరకు రేవంత్‌రెడ్డి ప్రజలకు పడ్డ బాకీ. ఎందుకు చెల్లించలేదు అంటే, డబ్బులు లేవంటూ దొంగ ఏడుపులు. వాస్తవం అ ది కాదు; రాహుల్ గాంధీ కోసం కొల్లగొట్టిన తెలంగాణ ఏటీఎం సాక్షిగా రివర్స్ రాబిన్ హుడ్ మాదిరి పేదలను కొట్టి, ఢిల్లీ గద్దలకు పంచుతున్నడు!
హృదయవిదారకంగా అసువులు బాసిన పాశమైలారం కుటుంబాలకు కేవలం రూ.40 కోట్లు ఇవ్వడానికి కూడా మనసు రాలేదంటే ఏమనాలి రేవంత్‌ను? అందుకే ‘ఏ-వన్ పాలయ్యింది తెలంగాణ’ అని ప్రజలు, తెలంగాణవాదులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చివరగా… ఓటరు తీర్పులను కూడా చెరబట్టి సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నెన్ని దారుణాలు చేసిండో రేవంత్‌రెడ్డి అనేది కండ్ల ఎదురుగా ఉన్నది. తాండూరు, వికారాబాద్, క్యాతనపల్లి, జనగామ, తొర్రూరు ఒక చిన్న శాంపిల్ మాత్రమే. మన నీళ్లు ఆంధ్రాకు దోచిపెట్టి, మన నిధులు రా హుల్కు అప్పజెప్పి మన కలలను కొల్లగొడుతున్న ఈ దుర్మార్గాన్ని ఇంకెంతకాలం సహిద్దాం?
మన ఇంట్లో బాలింతను ఎంత జాగ్రత్తగా చూసుకుంటం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం తర్వాత తల్లీ బిడ్డలను ఇంటికి చేర్చేదాకా, అనంతరం కూడా వారి ఆరోగ్యానికి పూచీ పడే ‘కేసీఆర్ కిట్’ను ఆపేస్తరా? అంటూ ఆగ్రహించారు ఆ మధ్య కేసీఆర్‌ను కలిసినప్పుడు. ఆ మాటల్లో అనంతమైన ప్రేమ కనబడింది జీవనదాతలైన తల్లులపై. తల్లుల క్షేమం గురించి కేసీఆర్ లోతుగా ఆలోచిస్తారు కాబట్టే… పంట పండడం గురించి కూడా అంతే తపన ఆయనది.
-శ్రీశైల్ రెడ్డి పంజుగుల ,90309 97371