మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Editorial - Sep 09, 2020 , 00:12:21

చిక్కుల్ని తొలిగించుకోవాలె

చిక్కుల్ని తొలిగించుకోవాలె

వివాదాస్పద భూమిలో కరసేవ ప్రారంభించేందుకు అనేక ముందస్తు ప్రయత్నాలు ఒకవైపు జరుగుతున్నా.. వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నట్లు యూపీ ప్రభుత్వం వ్యవహరించటం లేదు. దీంతో కోర్టు యూపీ ప్రభుత్వ మాటలను విశ్వాసంలోకి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఆ నేపథ్యంలో కోర్టు స్పందన.

  • ఏడో అధ్యాయం కొనసాగింపు..

మీరు కట్టడం భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతను గూర్చి హామీ ఇస్తూనే వస్తున్నారు. అయినా మరోవైపు నుంచి గతంలో ఉన్న భద్రతా చర్యల్ని మేము కాదంటున్నా వినకుండా ఉపసంహరించారు. మీరు అయోధ్యలో మరో 15 కంపెనీల పోలీసు సాయుధ బలగాలను ఉంచాలని సూచించారు. మతావేశపు వాతావరణంలో అయోధ్యలో హింస ప్రజ్వరిల్లితే ఆ బలగాలు చాలవని మేము భావిస్తున్నాం. పైగా అటువంటి పరిస్థితిని అదుపులో ఉంచేందుకు తగిన సంఖ్యలో బలగాలు లేకుంటే ఉన్నవి ప్రమాదానికి గురికావలిసి వస్తుంది. మేము గతంలో కూడా కేంద్ర బలగాలను రాష్ట్రప్రభుత్వాలకు ఇచ్చేందుకు సిద్ధప డ్డాం. ఇప్పుడు వాటిని దగ్గరతావుల్లోకూ ఉంచటానికి గల కారణం అవసర పడగానే రాష్ట్ర ప్రభుత్వం ఆ బలగాలను ఉపయోగించుకోగలుతుందని. కనుక మా సహాయం పట్ల మీరు దయచేసి గంభీరంగా ఆలోచన చేసి చూడండి.

అప్పుడు చవాన్‌ సుప్రీంకోర్టు వ్యవహారాన్ని గుర్తుచేస్తూ కట్టడపు తక్షణ భద్రత కోసం కేంద్రం ఇచ్చిన సలహాలను అమలుపరచమనే చొరవను ఈ విధంగా కల్పించుకున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో రామజన్మభూమి-బాబ్రీ మసీదు కట్టడపు భద్రత విషయం కూడా చర్చకు వచ్చింది. భద్రత దృష్ట్యా ప్రస్తుత ఏర్పాట్లలోని లోటుపాట్లను కేంద్రప్రభుత్వం వెల్లడిస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు  వాటిని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్లమంది. కోర్టువారు కేంద్రం సూచనలకు నిర్మాణాత్మకంగా ఆలోచన చేయమని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదిని కోరటం జరిగింది. అలా కోర్టు పరిశీలన జరిపి అంతటితో  ఆగక కేంద్రం సూచనల్ని కోర్టులోనే రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాదికి అందజేయటం జరిగింది. ఆ విధంగా ఆ కోర్టు వ్యవహారం ద్వారా రామజన్మభూమి-బాబ్రీమసీదు రక్షణ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పట్టించుకున్న తీరుకు తార్కాణంగా నిలుస్తుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే మా సూచనలను పట్టించుకొని శాంతిభద్రతల విషయంలో ఉత్తరప్రదేశ్‌లోనే గాక దేశంమొత్తం మీద తలెత్తనున్న చిక్కుల్ని తొలగించుకునేందుకు సిద్ధమవుతుందని ఆశిస్తాను.

జస్టిస్‌ యమ్‌.యన్‌. వెంకటాచలయ్య, జస్టిస్‌ జీయన్‌ రేలతో కూడిన ఇరువురు న్యాయాధీశుల సుప్రీంకోర్టు ధర్మాసనం కోర్టు ధిక్కార నేరారోపణపై డిసెంబర్‌ 1 నుంచి వాదోపవాదాలను తిరిగి వినసాగింది. కోర్టు పరిశీలన ప్రారంభం కాగానే అటార్నీ జనరల్‌ మిలాన్‌ బెనర్జీ కేంద్ర ప్రభుత్వం వివాదంలో ఉన్న కట్టడపు భద్రతను గూర్చి తీవ్రంగా మథనపడుతున్నదని తెలియజేశారు. మతపరమైన కల్లోలాల్ని సృష్టించేందుకు కృషి జరుగుతున్నదని ఆయన సూచనప్రాయంగా చెప్పారు.  

(మాజీ ప్రధాని పీవీ రాసిన ‘అయోధ్య’ పుస్తకం నుంచి..)


logo