శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Editorial - Jan 31, 2020 , T00:10

ప్రజల్లోకి చేరిన లౌకికత్వం

ప్రజల్లోకి చేరిన లౌకికత్వం

గత నెల రోజులుగా సాగుతున్న ఉద్యమాలలో మన ప్రజాస్వామ్యంలో కొత్త నినాదం ఉనికిలోకి వచ్చింది. మేధోపరమైన అకడమిక్ చర్చలలో కాకుండా వీధుల్లో ప్రజస్వామ్యానికీ, లౌకికత్వానికి కొత్త నిర్వచనం రూపుకడుతున్నది. ఆ క్రమంలోవారు సరికొత్త నినాదాలతో, సరికొత్త పోస్టర్ల ప్రదర్శనతో, పాటలతో సృజనాత్మక వ్యక్తీకరణలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. హిందూ ముస్లిం రాజీ-తో క్యా కరేగా నాజీ అంటూ (హిందూ ముస్లింలు ఏకతాటిపై నిలిస్తే-నాజీలు ఏం చేయగలరు) నినదిస్తున్నారు.

సుదూర భవిష్యత్తులో మన దేశ చరిత్ర రాసినప్పుడు (ఎంపీ రాకేశ్ సిన్హా, దీనానాథ్ బాత్రా వంటి వారు తమ ఇష్టం వచ్చినట్లు రాసేది కాదు) నేటి బీజేపీ ప్రభుత్వం రెండు పర్యాయాలు అధికారానికి వచ్చిన తర్వాత మన సంస్కృతికీ, ప్రభుత్వ సంస్థలకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ విలువలకు చేసిన అపారమైన నష్టం తప్పని సరిగా నమోదవుతుంది. అయితే బీజేపీ ప్రభుత్వం కలిగించిన అపారమైన నష్టంతో పాటు ఆ పార్టీ సృష్టించిన కొన్ని అద్బుతాలు కూడా నమోదు చేయవలసిందే. 

బీజేపీ మొరటుగా,ఏకపక్షంగా చేపట్టిన విధానాల వల్ల తలెత్తిన పరిణామాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేశాయ ని అనవచ్చు. ఉదాహరణకు పౌరసత్వ సవరణ చట్టం,జాతీయ పౌరపట్టిక వంటివి సమాజాన్ని మథింప చేస్తున్నాయి. ఆధిత్యనాథ్ పాలనలో ముసుగు కప్పిన పోలీస్ అత్యా చారాలు, ప్రధాని అనుచర గణాలు సాగిస్తున్న అబద్దాల ప్రచారాలు ఇందుకు ప్రతి గా వెలువెత్తుతున్న నిరసనలు నిజంగా మన ప్రజాస్వా మ్యాన్ని మరింత బలోపేతం చేయబోతున్నాయి. ఒకప్పుడు లౌకిక వాదమనేది పార్లమెంటు, సుప్రీంకోర్టు వంటి భావనలు ఉన్నత వ్యవస్థల వరకే పరిమితం అయి ఉండేవి. అవి దిగ్బంధం చేసిన ఒక విగ్రహం మాదిరిగా కనిపించేది. ఎన్నికల సందర్భంలో మాత్రం ఉత్సహవిగ్రహంగా ఊరేగేవి. కానీ ఇప్పుడు చరిత్ర లో మొదటిసారిగా ఆ పరిమితుల నుంచి బయటపడ్డ లౌకికవాదం వీధుల్లోకి వచ్చిన సాధారణ ప్రజల్లో, పార్కులలో, విశ్వవిద్యాయాలల్లో ఉత్సాహభరితంగా మారుమోగుతున్నది. ఒక వేళ మీరు ఈ అద్భుత సృష్టిని చూడాలనుకంటున్నా రా.. అయితే ఢిల్లీలోని షహీన్‌బాగ్ లేదా అలహాబాద్‌లోని  రోషన్ బాగ్, కలకత్తా లోని పార్క్ సర్కస్, లక్నోలోని క్లాక్ టవర్, పాట్నాలోని ఫుల్వారీ షరీఫ్ ఇంకా దేశవ్యాప్తంగా ఇలాంటి డజన్లకొద్దీ నగరాల్లో జరుగుతున్న నిరసనోద్యమాలు  ప్రజాకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. ఆ నిరసనోద్యమాల్లో మనకు హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రిష్టియన్లు ఐక్యంగా కలిసి కూర్చొని ఉండటం కనిపిస్తుంది. ఆ క్రమంలో వారు గడ్డ కట్టే చలిని లెక్కచేయకుండా, ఎన్నో అసౌకర్యాల మధ్య జీవనోపాదులను త్యాగం చేస్తూ పోలీసుల దౌర్జన్యాలను భరిస్తూ ఉద్యమిస్తుం టారు. అక్కడ మనకు కనిపించేది ఒకే ఒక గుర్తింపు. అందరూ ఉమ్మడి బాధితు లుగా మతాలకు అతీతంగా అందరూ ఒకే మతంగా వ్యవహరిస్తున్నారు. ప్రభు త్వం మాత్రం ప్రజల్లో చీలికలు తెస్తూ వేలాది విభజనలకు పాల్పడుతుంటే, ప్రజలు తామంతా ఒకటేనని చాటుతున్నారు. నరేంద్రమోదీ, అమిత్‌షాల అనాలోచిత అవాంఛనీయ విధానాలతో రెండునెలల్లో డ్బ్భై ఏండ్లకు పైగా ఉన్న రాజ్యాంగ విలువలు ధ్వంసమై పోయాయి. అలాగే ఈ డ్బ్భై ఏండ్లుగా ఎప్పుడూ సాధ్యంకాని విధంగా సమాజంలోని అన్ని వర్గాలు, మతాల ప్రజలు ఏకతాటిపైకి వచ్చి లౌకికవాద స్ఫూర్తిని చాటుతున్నారు. ఇన్నేండ్లు గా ఏ రాజకీయ పార్టీ, నేత ఏకం చేయని విధంగా ఇవ్వాళ లౌకిక విలువల కోసం రాజ్యాంగం ప్రసాధించిన హక్కుల కోసం ఉద్యమిస్తున్నారు.మోదీ-షా ఆశించిందేమంటే.. సీఏఏ, ఎన్‌ఆర్సీ ద్వారా హిందూ-ముస్లింలలో శాశ్వత విభజన తీసుకురావాలని. ఆ క్రమంలో కుటుంబాలను, ఇండ్లను, వీధులను విభజించాలని చూశారు. కాని వారు ఆశించిన దానికి భిన్నంగా ప్రజలను అవి ఏకం చేశాయి. పుస్తకాలలో రాసుకున్న లౌకికత్వానికి భిన్నంగా ప్రజలు తమ నిజ జీవిత ఆచరణతో కొత్త, నిజమైన అర్థాన్ని చెబుతున్నారు. ఇలాంటి మోదీ, అమిత్ షాలు కోరుకోని ఫలితాలే గాక మరిన్ని మంచి పరిణామాలు కూడా చోటుచేసుకు న్నాయి. దేశ ప్రజలు దేశ మూడు రంగుల జెండానూ, జాతీయ గీతాన్ని కొత్త అర్థాలతో చూస్తున్నారు. ఉదయం, సాయంత్రం జాతీయ గీతాలాపనతో తమ కార్యకలాపాలను ప్రారంభిస్తూ ముగిస్తున్నారు. నిరసనోద్యమాల్లో ప్రజలు తమపై జులుం చేయటానికి వచ్చిన పోలీసుల ముందు జాతీయ జెండాలతో, జాతీయ గీతాలాపనతో నిలువరిస్తున్నారు. అలాగే ఉద్యమాల గురించి వస్తున్న అన్ని రకాల అబద్ధాలను, తప్పుడు వార్తలను, హింసను, బెదిరింపులను కూడా జాతీయ గీతాలతోనే ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం మాత్రం తన అణచివేత విధానాలతో తప్పుడు ప్రచారాలను ఆపటం లేదు. జాతి వ్యతిరేకులని, తుక్డే తుక్డే గ్యాంగ్ అని, అర్బన్ నక్సలైట్లని, కుహనా సెక్యులరిస్టులనే అబద్ద ప్రచారాలను చేస్తూనే ఉన్నది.


 ఈ నేపథ్యంలో ప్రభుత్వ విధానాల కారణంగా మన జాతీయ జెండా,జాతీయ గీతం చేరవలసిన చోటకే చేరింది. పోలీసుల నిర్బంధంలో ఉన్న వారు తమ చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకొని స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం నినదిస్తున్నారు. షహీన్‌బాగ్‌లో ఓ నాలుగేండ్ల బాలుగు జెండా పట్టుకొని సర్కార్ తీరుకు జవాబుగా నిలుస్తున్నాడు. ఆ విధంగా ప్రజలు  కొత్త విలువలను ప్రతిపాదిస్తున్నారు. మరోవైపు ఈ ప్రభుత్వానికి మహిళలు తమ నిరసనోద్యమాలతో సరికొత్త పాఠాన్ని నేర్పుతున్నారు. సమాజంలో యాభై శాతంగా ఉన్న మహిళలు పురుషాధిపత్యాన్ని త్యజించి వీధుల్లోకి వస్తున్నారు. ఆ క్రమంలో వారు అన్ని రకాల సంప్రదాయ, ఆచార బంధనాలను తెంచుకొని ఇంటినుంచి బయటకు వస్తున్నారు. పరదా, హిజాబ్, బుర్ఖా లాంటి అవరోధాలను దాటి ఐకమత్యంగా ఉద్యమిస్తున్నారు. ట్రిపుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలను విముక్తి చేశామని చెప్పిన బీజేపీ అప్పుడు విముక్తి చేసిందో లేదో కానీ, ఇప్పుడు ముస్లిం మహిళలు విముక్తికోసం నినదిస్తున్న తీరు బీజేపీకి మింగుడు పడనిదై ఉంటున్నది. ఇప్పుడు ట్రిపుల్ తలాక్ సమస్య కాదు, పౌరసత్వ సవరణ చట్టం సమస్యగా మారింది. అందుకోసం మహిళలు  సంఘటితంగా ఉద్యమిస్తున్నారు. గృహనిర్వాహకులుగా శతాబ్దాలుగా ఇండ్లకే పరిమితమైన మహిళలు తమ ఇండ్లను వదిలి తమ పిల్లల భవిష్యత్ కోసం, వారి హక్కుల కోసం వీధుల్లోకి వస్తున్నారు. పోలీసులు సృష్టిస్తున్న నిర్బంధాలను ఛేదించుకొని ఎఫ్‌ఐర్‌లకు  భయపడకుండా కదులుతున్నారు. హిందు మత పెద్దలు, ఉలేమాలు విధిస్తున్న పరిధులను దాటి బయటకు వస్తున్నారు. ఇక్కడే వారి నిజమైన లౌకికత్వం ఉన్నది. ఇప్పటిదాకా ఏ చట్టాలు ఇవ్వనటువంటి స్వేచ్ఛతో నిరసనోద్యమాలలో భాగస్వాములవుతున్నారు. బీజేపీ ఊహించిన తప్పుడు అంచనాలకు అతీతంగా మహిళలు కదులుతున్నారు. ఇదే ఇప్పుడు మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తున్నది.గత నెల రోజులుగా సాగుతున్న ఉద్యమాలలో మన ప్రజాస్వామ్యంలో కొత్త నినాదం ఉనికిలోకి వచ్చింది. మేధోపరమైన అకడమిక్ చర్చలలో కాకుండా వీధుల్లో ప్రజస్వామ్యానికీ, లౌకికత్వానికి కొత్త నిర్వచనం రూపుకడుతున్నది. ఆ క్రమంలో వారు సరికొత్త నినాదాలతో, సరికొత్త పోస్టర్ల ప్రదర్శనతో, పాటలతో సృజనాత్మక వ్యక్తీకరణలతో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుతున్నారు. 

హిందూ ముస్లిం రాజీ-తో క్యా కరేగా నాజీ అంటూ (హిందూ ముస్లింలు ఏకతాటిపై నిలిస్తే-నాజీలు ఏం చేయగలరు) నినదిస్తున్నారు. ఇప్పుడు సరికొత్త ప్రజాసం గీతం వినిపిస్తున్నారు. బాబ్ దిలాన్, బాబ్ మార్లే, జోన్ బీజ్ లా వీధుల్లో ప్రజా సంస్కృతిని చాటుతున్నారు.మన యువత, విద్యార్థిలోకం ఫేస్‌బుక్, వాట్సప్‌లతో నిరసనోద్యమాలకు అగ్రభా గాన నిలుస్తున్నారు. ఈ క్రమంలో వారు చరిత్రను మరింత అర్థవంతమైన వ్యక్తీకరణలతో ప్రదర్శిస్తున్నారు. భారత రాజ్యాంగాన్ని సరికొత్త అర్థంలో అస్త్రంగా ప్రయోగిస్తున్నారు. గాంధీ, సుభాష్‌చం ద్రబోస్‌లను ఆదర్శంగా ప్రకటిస్తూ ప్రభుత్వ నిర్బంధాలను బాధితులుగా ప్రతిఘ టిస్తున్నారు. ఫైజ్ మొహమ్మద్ ఫైజ్, నాగార్జున్, హబీబ్ జాలిబ్, ఇక్బాల్, దుష్యం త్ కుమార్‌ల గీతాలను ఆలపిస్తున్నారు.దేశవ్యాప్తంగా 40 యూనివర్సిటీల నుంచి వీధుల్లోకి వచ్చిన విద్యార్థులు ఇక చాలు మీ ఉత్పాతాలంటూ లేచినిలబడి నినదిస్తున్నారు.  భ్రష్టుపట్టిస్తున్న నేతల స్థానంలో కొత్తతరం నాయకత్వాన్ని దేశానికి అందిస్తున్నారు.సాధారణ ప్రజలకు ఆధునిక రాజ్యాన్ని ఎదుర్కోవటం కష్టతరమైనది. పోలీసులు, సైన్యాలు, అబద్దప్రచారాలతో నిండి ఉన్న మీడియాను ఎదుర్కోవటం క్లిష్టమైనది. అయితే ఈ నిరసనోద్యమాల ఫలితాలు భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయని చెప్పటం అసాధ్యం.అయితే ఎప్పుడూ ఊహించిన ఫలితాలే ఉంటాయని అనుకోలేం. అయినా మోదీ తనదైన ఆలోచనలతోనే, తక్షణ ఫలితాలను ఆశించే ముందుకుపోతున్న తీరు కనిపిస్తున్నది. ఇప్పటికైనా పౌరసత్వం, లౌకికత్వం, బహుళత్వం, జాతీయత, సమానత్వం లాంటి విలువలు తమదైన ప్రాసంగికతను చాటుతున్నాయి. ప్రభుత్వ నిరకుశత్వానికి ప్రతిఫలనాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడే మొహమ్మద్ ఇక్బాల్ గీతం గురించి చెప్పుకోవాలి. ఆయన.. జాతి రాజ్యాలు కవుల గుండెల్లోంచి పుడుతాయి. కాని అవి రాజకీయ నేతల చేతుల్లో చనిపోతాయని అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది అదేనా..!

(వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్ అధికారి. పర్యావరణ వేత్త) 


logo