
తెలంగాణకు పెద్ద పండుగ దసరా. ఎంగిలి పూల బతుకమ్మ మొదలు.. జమ్మి తెంపి, పాలపిట్టను చూసేదాకా పది రోజుల వైభవం. గతేడాది కొవిడ్ పరిస్థితుల్లో విజయదశమిని పెద్దగా చేసుకోకపోవడంతో ఈసారి ఘనంగా జరుపుకోవాలని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్టే యువతులు, మహిళలు అంగరంగ వైభవంగా రోజూ బతుకమ్మ ఆడుతున్నారు. మరోవైపు పండుగకు రెండ్రోజులే మిగిలి ఉండడంతో మార్కెట్లో షాపింగ్ సందడి మొదలైంది. కొనుగోలుదారులతో దుకాణాలు, పట్టణాల్లోని ప్రధాన ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి.