భూపాలపల్లి, డిసెంబర్ 30: పని స్థలాల్లో ప్రతి ఒక్కరూ విధిగా రక్షణ సూత్రాలు పాటిస్తూ, బొగ్గు ఉత్పత్తి చేయాలని రామగుండం రీజియన్ సేఫ్టీ జీఎం ఎల్వీ సూర్యనారాయణ సూచించారు. భూపాలపల్లి ఏరియాలోని ఇల్లెందు ఫంక్షన్ హాల్లో అన్ని జాతీయ సంఘాలు, టీబీజీకేఎస్ యూనియన్ ప్రతినిధులతో గనుల్లో రక్షణ చర్యల పెంపునకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానిక జీఎం టీ. శ్రీనివాసరావు అధ్యక్షతన గురువారం ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. వర్క్ షాప్ లు, గనుల్లో రక్షణ పెంపు కోసం చేపట్టాల్సిన చర్యల గురించి యూనియన్ల ప్రతినిధులు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. అంతకు ముందు బొగ్గు గనుల్లో సంస్థ తీసుకున్న రక్షణ చర్యలపై రక్షణ విభాగ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా సేఫ్టీ జీఎం మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి రక్షణ పరికరాలు ధరించాలని, అధికారులు తమకు కేటాయించిన పని స్థలంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక జీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికుల సమష్టి కృషి, పట్టుదలతోనే సింగరే ణి సంస్థ అనేక అంతర్జాతీయ, జాతీయ అవార్డులను సొం తం చేసుకుందని పేర్కొన్నారు. ఏఎస్వో రవీందర్, గనుల రక్షణ అధికారులు, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు వర్క్‌షాప్ నిర్వహించగా, అధికారులు విజయప్రసాద్, బీవీ రమణ, డీజీఎం(సివిల్) సత్యనారాయణ, ఆయా యూనియన్ల ప్రతినిధులు కొక్కుల తిరుపతి, మోటపల్కుల రమేశ్, అప్పాని శ్రీ నివాస్, కంపేటి రాజయ్య , దేవదాస్ గనుల పిట్ సెక్రటరీలు కొచ్చర్ల రవికుమార్, గాజే సాంబయ్య, బాసనపల్లి కుమార్, మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్ వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
శాంతిఖని షాఫ్ట్‌లో..
బెల్లంపల్లిటౌన్, డిసెంబర్ 30: కార్మికులు రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ మెకానికల్ (డీడీఎంఎస్) మెకానికల్ బీ రవీంద్ర సూచించారు. మందమర్రి ఏరియాలోని శాంతిఖని షాఫ్ట్ గనిని ఆయన తనిఖీ చేశారు. పలు యంత్రాల పనితీరును పరిశీలించారు. పనిస్థ్ధలాల వద్ద సంబంధిత పరికరాల నిర్వహణను పర్యవేక్షించారు. గని ప్రాజెక్ట్ అధికారి కే.వెంకటేశ్వర్లు, ఏరియా ఇంజినీర్ రామ్మూర్తి, శాంతిఖని గ్రూప్ ఇంజినీర్ జీ కృష్ణమూర్తి, గని మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హా, పిట్ ఇంజినీర్ రాంప్రసాద్, రక్షణ అధికారి సుధీర్, అడిషనల్ మేనేజర్ రాజు, రాంబాబు, సేఫ్టీ ఇంజినీర్ రాంసాగర్ ఉన్నారు.
ఆర్జీ 2 ఏరియాలో..
యైటింక్లయిన్‌కాలనీ, డిసెంబర్ 30: రక్షణ సూత్రాలు పాటి స్తూ ప్రమాదరహిత సింగరేణిగా పేరొందేలా ప్రతి ఉద్యోగీ కృ షి చేయాలని ఆర్జీ-2 జీఎం టీ. వెంకటేశ్వర్రావు సూచించా రు. గురువారం ఆర్జీ-2 ఏరియాలోని కాన్ఫరెన్స్ హాలులో జరిగిన ఓసీపీ-3, సీహెచ్‌పీ ఉద్యోగుల సేఫ్టీ వర్క్‌షాప్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముందుగా ఏరియా రక్షణాధికారి జీఎల్ ప్రసాద్ డివిజన్లో ఇటీవల జరిగిన ప్ర మాదాలు, వాటికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఆనంతరం జీఎం మాట్లాడుతూ పని స్థలాల్లో ముందస్తుగా ప్రమాదాలను గుర్తించి నష్ట నివారణ చర్యలు తీసుకునేలా ప్రతి ఉద్యోగిని చైతన్యపరచాలని తెలిపారు. సేఫ్ట్టీ జీఎం ఎల్వీ సూర్యనారాయణ, టీబీజీకేఎస్ డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, ఏరియా ఇంజినీర్ రాధాకృష్ణారావు, ప్రాజెక్ట్ అధికారి మోహన్‌రెడ్డి, పీఈ దుర్గాప్రసాద్, మేనేజర్ రమేశ్, సేఫ్టీ ఇన్చార్జి సదానందం తదితరులు పాల్గొన్నారు.