Gokul plots | గోకుల్ ప్లాట్స్ అభివృద్ధికి కృషి చేస్తా : విప్ గాంధీ

మాదాపూర్ : గోకుల్ ప్లాట్స్‌లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని గోకుల్ ప్లాట్స్ కాలనీలో బుధవారం స్థానిక కార్పొరేటర్ వి. జగదీశ్వర్ గౌడ్‌తో పాటు స్థానిక టీఆర్ఎస్ నాయకులతో కలిసి రూ. 50 లక్షల వ్యయంతో చేపడుతున్న వరద నీటి కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గోకుల్ ప్లాట్స్ కాలనీని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది అన్ని రకాల మౌలిక వసతులను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వరద నీటి కాలువ నిర్మాణ పనులను స్థానిక అధికారులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పారు.
ఎటువంటి నాణ్యత లోపాలు లేకుండా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం అధికారులకు తగు సూచనలు, సలహలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్, మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాంబశివరావు, గుమ్మడి శ్రీనివాస్, అప్పారావు, గణేష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

