ఖైరతాబాద్ : వృద్ధి ట్రెండ్స్ ఫ్యాషన్ మెన్స్‌వేర్ లోగోలను శాసన మండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్ రావు, భానుప్రసాద్, సినీ, టీవీ నటుడు హైపర్ ఆదీ, సైకలాజిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తితో కలిసి సోమవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో ఆవిష్కరించారు.
భూపాల్ రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన, సామాన్యులకు అందుబాటులో ఉండే ధరల్లో ఫ్యాషన్ దుస్తులను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో వృద్ధి ట్రెండ్స్ డైరెక్టర్లు వీర శంకర్ రావు, వేణుగోపాల్ రావు, శ్రీనివాస్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.