మైలార్‌దేవ్‌పల్లి : భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచదేశాలకు చాటిన మహానుభావుడు స్వామి వివేకానంద అని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్‌గౌడ్ అన్నారు. బుధవారం స్వామి వివేకానంద 159వ జయంతిని పురస్కరించుకొని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని పద్మశాలిపురం చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి శ్రీ రామ క్రిష్ణ సేవా సమితి అద్యక్షుడు బొల్ల శ్రీనుతో కలిసి పూల మాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వామి వివేకనందుడు దేశ ప్రజలకు ఆదర్శంగా నిలిచాడని గుర్తు చేశారు.నేటి యువతకు స్పూర్తి ప్రదాతగా నిలిచారని తెలిపారు.యువత ఆయన ఆశయాలను ఆయన చూపించిన మార్గంలో నడిచి దేశాన్ని అన్ని రంగాలలో ముందువరుసలో నిలబెట్టే జ్ఞానాన్ని సంపాదించుకోవాలని కోరారు.
అనంతరం వివేకానంద సేవాసమితి అధ్యక్షుడు బొల్ల శ్రీను మాట్లాడుతూ..పద్మశాలిపురంలో రామక్రిష్ణ సేవా సమితి ఏర్పాటు చేసి యువతతో కలిసి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మైలార్‌దేవ్‌పల్లి ఎస్ఐ గోపరాజు,డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్ ,సరికొండ వెంకటేష్ ,మునగపాటి చంద్రయ్య,మసున వెంకటేష్ ,బోల్ల శ్రీను,మునగపాటి వెంకటేష్ ,మహేష్రాజ్ ,కాశిగారి యాదగిరి,గంజి వెంకటేష్ ,డివి కుమార్ , నాని,మొగలి క్రిష్ణ,ఎం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.