మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ వివేకానందనగర్ కాలనీ అపార్ట్మెంట్ అసోసియేషన్, రెసిడెన్షియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కార్తీక వన భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావుతో కలసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఉసిరి చెట్టు వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విప్ గాంధీ మాట్లాడుతూ కార్తీక వన భోజన మహోత్సవాలు ఆధ్యాత్మికతతో పాటు సమూహ భావాన్ని పెంపొందిస్తాయన్నారు. కార్తీక దామోదరుడి అనుగ్రహం నియోజకవర్గంలోని ప్రజలందరిపైనా ఉండాలని ఆకాంక్షించారు.
ఉసిరి చెట్టు కింద భోజనం ఆరోగ్యం , భక్తి భావమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు వాసుదేవరావు, వెంకట్రావు, నరేందర్, శ్రీను,రాధిక, సత్యవతి, నాగమణి, పద్మ, శోభ, అనీల్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా మహా పడి పూజ…
ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో అంబీర్ చెరువు సమీపంలోని అయ్యప్ప దేవాలయంలో 18 కలశాలతో అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో ఆదివారం వైభవంగా జరిగింది. ఈ పూజ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ అయ్యప్ప స్వామి మండల దీక్ష మహా భక్తి శ్రద్ధలతో కఠిన నియమాలతో స్వాములు నిర్వహిస్తారన్నారు. అయ్యప్పస్వామి అనుగ్రహం ప్రజలందరిపైనా ఉండాలని స్వామి అనుగ్రహంతో కరోనా పీడ పూర్తిగా విరుగుడు కావాలని విప్ గాంధీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, పార్టీ నేతలు యాదగిరి గౌడ్, రామకృష్ణ గౌడ్,సతీష్రావు, కాశీనాథ్యాదవ్, భాస్కర్,బాలరాజు, వాసు,మున్నా, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.