
న్యాల్కల్, జనవరి 6 : సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక స్వామి ఆలయానికి గురువారం భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి 222వ జయంత్యుత్సవాలను కంచి కామకోటి పీఠం, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. గురువారం వేదపండితులు స్వామివారికి అభిషేకం, హారతి తదితర పూజలు నిర్వహించారు. యాగశాలలో వందలాది మంది దంపతులతో వేదపండితులు శతచండీ యాగం చేశారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవత్ కుబా దంపతులు, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు తదితరులు ఆలయాన్ని దర్శించుకుని పూజలు చేశారు.
నేటి కార్యక్రమాలు…
శుక్రవారం ఉదయం స్వామి వారికి అభిషేకం, 9 గంటలకు సిద్ధి, బుద్ధి సమేత సిద్ధివినాయక స్వామి కల్యాణోత్సవం, మహామంగళ హారతి, తీర్థప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంకాల్ సుభాశ్, మురళీకృష్ణగౌడ్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, పీఎసీఎస్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, రేజింతల్ గ్రామ సర్పంచ్ కుతుబోద్దీన్, మండల నాయకులు బక్కారెడ్డి, శేఖర్‌రెడ్డి ఆలయ కమిటీ అధ్యక్షుడు రేజింతల్ సంగయ్య, ప్రధాన కార్యదర్శి అల్లాడి నర్సింహులు, ఉపాధ్యక్షులు రమేశ్, కోశాధికారి నీల రాజేశ్వర్, సెక్రటరీ ఉల్లిగడ్డ బస్వరాజ్, సంయుక్త కార్యదర్శులు చిద్రి లక్ష్మణ్, కమిటీ సభ్యులు అల్లాడి వీరేశం, గణేశ్ దీక్షిత్, కోబ్బజీ రవికుమార్, కల్వ చంద్రశేఖర్, సిద్ధప్ప, దేవిదాస్ కులకర్ణి, రాజేశ్వర్, రాజ్‌కుమార్, అశోక్, మేనేజర్ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.