విద్యానగర్, జనవరి 2 : కామారెడ్డి జిల్లాలో సోమవారం నుంచి 15 -18 సంవత్సరాలలోపు వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీఎంహెచ్వో డాక్టర్ చంద్రశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 15 -18 సంవత్సరాలలోపు వారు సుమారు 50 వేల నుంచి 60 వేల మంది ఉంటారని తెలిపారు. జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, పాఠశాలలు, కళాశాలల్లోనే విద్యార్థులకు వైద్య సిబ్బంది టీకాలు వేస్తారని పేర్కొన్నారు. కొవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.