
మెదక్, డిసెంబర్ 19 : మెదక్ జిల్లాలో కరోనా టీ కా మొదటి డోస్ లక్ష్యానికి మించి వేశారు. మంగళవారంతో 103.38 శాతానికి చేరుకొని రాష్ట్రంలో నే జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఇదే స్ఫూర్తి తో రెండో డోస్ వారం రోజుల్లో పూర్తి చేయనున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో నూరు శాతానికి మించి కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. జిల్లాలో 103.38 శాతం మొదటి డోస్ పూర్తి కాగా, రెండో డోస్ తీసుకున్న వారు 56.74 శాతం మాత్రమే, ఇంకా లక్షా 92వేల మంది తీసుకోవాల్సి ఉంది.
మొదటి డోస్ 103.38 శాతం..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు, నాలు గు మున్సిపాలిటీలు ఉన్నాయి. మొత్తం 7,67, 428 జనాభా కాగా, 5,48,340 మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు మొదటి డోస్ 5,66,891 (103.38 శాతం) మంది తీసుకున్నారు. రెండో డోస్ 3,12,002 (56.74 శాతం) మంది తీసుకోగా, ఇప్పటి వరకు జిల్లాలో8,78,893 మంది వ్యాక్సిన్ తీసుకున్నా రు.18 ఏండ్ల్ల నుంచి 44 సంవత్సరాల వరకు మొదటి డోస్ తీసుకున్న వారు 2,47,777 మంది కాగా, రెండో డోస్ తీసుకున్న 96,925 మంది మొత్తం 3,44,702 మంది కరోనా వ్యాక్సి న్ తీసుకున్నారు. 45 ఏండ్ల నుంచి 59 సంవత్సరాల వరకు మొదటి డోస్ 2,01,687 టీకా తీసుకోగా, రెండో డోస్లో 1,36,661 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. మొత్తంగా 3,38, 348 మంది తీసుకున్నారు. 60 ఏండ్ల్ల వారు మొదటి డోస్లో 1, 11 ,005 మంది తీసుకోగా, రెండో డోస్లో 73,936 మంది తీసుకో గా మొత్తం 1,84,941 మంది తీ సుకున్నారు.
జిల్లాలో జోరుగా వ్యాక్సినేషన్..
జిల్లాలో లక్ష్యానికి మించి టీకా వేసేందుకు వైద్య అధికారులు చర్య లు తీసుకుంటున్నారు.కొత్తగా వేరియంట్ వస్తుం దన్న భయాందోళనలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, దాని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ ఇంటింటికీ వెళ్లి పల్లెలు, పట్టణాలో ప్రచారం నిర్వహిస్తున్నారు.జిల్లా కలెక్టర్ హరీశ్ జిల్లాలోని 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో ప్రతి రోజు కనీసం వేయి చొప్పున రోజు 20వేలకు పైగా టీకాలు వేయాలని, పది రోజుల్లోగా లక్ష్యాన్ని సాధించాలని ఆదేశించారు. గ్రామాల్లో సర్పంచ్, గ్రామ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, స్వయం సహాయక సంఘాల మహిళలు, డీఆర్డీఏ-ఐకేపీ సి బ్బంది బృందంలో ఉండి వ్యాక్సినేషన్ విజయవంతానికి సహకరిస్తున్నారు. మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లు, కమిషనర్లు, కౌన్సిలర్లు, మండలాల్లో ఎం పీడీవోలు, తహసీలార్లు, ఏపీఎంలు, ఏపీవో లు, ప్రజాప్రతినిధులు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రర్యవేక్షణలో పాలుపంచుకుంటున్నారు.
రాష్ట్రంలో మూడో స్థానం…
మొదటి డోస్ కరోనా వ్యాక్సినేషన్ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు మొదటి డోస్ 5,66,891 (103.38 శాతం) మందికి ఇ చ్చాం. రెండో డోస్ 3,12,002(56.74 శాతం) మంది తీసుకోగా, ఇప్పటి వరకు జిల్లాలో 8,78, 893 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. డిసెం బర్ నెలాఖరులోగా రెండో డోస్ వారికి టీకా ఇస్తా ం.ఇప్పటికే లక్ష్యానికి మించి కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టాం.