వనస్థలిపురం : ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధిని సద్వినియోగం చేసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. చింతలకుంటకు చెందిన మహ్మద్ రఫీ కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. చికిత్సకు ఆర్థిక స్థోమత సహకరించకపోవడంతో ఎమ్మెల్యే సిఫారసుతో సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్నాడు.
దీంతో ఆయనకు రూ.2లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును బుధవారం బాధితుడి భార్య పాతిమాకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ఎక్కడికి వెళ్లినా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చింతల రవికుమార్, నవీద్ తదితరులు పాల్గొన్నారు.