
కారేపల్లి, డిసెంబర్ 18 : రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వైరా నియోజకవర్గ ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ అన్నారు. మండలంలోని కారేపల్లి క్రాస్‌రోడ్, సీతారాంపురం గ్రామాల్లో శనివారం కారేపల్లి విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి డబ్బులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమచేస్తుందన్నారు. మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వాంకుడోత్ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, విశ్వనాథపల్లి, సీతారాంపురం సర్పంచ్‌లు హలావత్ ఇందిరాజ్యోతి, బానోత్ మారు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గుగులోత్ శ్రీను నాయక్, సంతదేవాలయ చైర్మన్ మల్లేల నాగేశ్వరరావు, తహసీల్దార్ రవికుమార్, ఎంపీడీవో జమలారెడ్డి, ఏఓ ఉమామహేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్ వీవీఎస్ శర్మ, సొసైటీ డైరెక్టర్లు అడ్డగోడ ఐలయ్య, మర్సకట్ల రోశయ్య, రామారావు, సీఈవో బొల్లు హన్మంతరావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వాంకుడోత్ సురేశ్, రైతులు దాచేపల్లి కృష్ణారెడ్డి, రూప్లా, ముఖర్జీ పాల్గొన్నారు.
కామేపల్లిలో..
కామేపల్లి, డిసెంబర్ 18 : వానకాలంలో పండించిన వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరరావు అన్నారు. శనివారం ముచ్చర్లలో పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రైతు వేదిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరను పొందాలన్నారు. ఇతర పంటలపై అన్నదాతలు దృష్టి సారించాలని ఖమ్మం డివిజన్ శ్రీనివాసరావు కోరారు. కార్యక్రమంలో ఏవో తారాదేవి, ఏఈవో ఉష, సీఈవో గాదె నాగయ్య, సతీశ్ పాల్గొన్నారు.