భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 5 (నమస్తే తెలంగాణ): ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భద్రాద్రిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ఈనెల 12, 13న జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనంతో పాటు ముక్కోటి ఉత్సవాలకు భక్తులకు అనుమతి లేదని భద్రాద్రి కలెక్టర్ అనుదీప్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదన్నారు. ఇప్పటికే ఆన్లైన్లో టిక్కెట్లు తీసుకున్న భక్తులకు వెబ్సైట్ ద్వారా తిరిగి సొమ్ము రీఫండ్ చేస్తామన్నారు. జిల్లాలో ర్యాలీలు, బహిరంగ సభలు నిషేధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలన్నారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.