ఉస్మానియా యూనివర్సిటీ : ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు పొందిన ఉస్మానియా యూనివర్సిటీ లా విభాగం ప్రొఫెసర్ జీబీ రెడ్డిని ఆ విభాగం అధ్యాపకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లా విభాగం డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ మాట్లాడుతూ లా విభాగం చరిత్రలో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా ప్రొఫెసర్ జీబీ రెడ్డి నిలిచాడని కొనియాడారు.
న్యాయ విద్యలో ఉత్తమమైన బోధనతో ఓయూ న్యాయ కళాశాలకు గుర్తింపు తెచ్చారని ప్రశంసించారు. అనేక పుస్తకా లను రచించడంతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని పరిశోధక పత్రాలు సమర్పించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లా విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ పంతునాయక్, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ రత్నాకర్‌రావు, డాక్టర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.