Road accident | ట్రావెల్స్ బస్సు ఢీకొని ద్విచక్రవాహనదారుని మృతి

అబిడ్స్ : ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ యువకున్ని అతి వేగంగా దూసుకు వచ్చిన ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రూప్‌బజార్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
ఇన్స్పెక్టర్ బి ప్రసాదరావు కథనం ప్రకారం….ఖమ్మం జిల్లా పైరిగూడెం గ్రామానికి చెందిన వి రాజు (29) నగరంలోని రాంనగర్ ప్రాంతంలో నివాసముంటూ జొమాటో డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా గురువారం ఉదయం సమయంలో జొమాటో డెలివరీ కోసం రాంనగర్ ప్రాంతం నుంచి అబిడ్స్ జీపీఓ నుంచి బ్యాంక్ స్ట్రీట్ వైపు వెళ్తున్నాడు.
అదే సమయంలో వెనక నుంచి ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు వెనక నుంచి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆరెంజ్ ట్రావెల్స్ డ్రైవర్ మనోజ్‌కుమార్ (40)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును ఇన్స్పెక్టర్ బి ప్రసాదరావు ఆధ్వర్యంలో ఎస్ఐ రవికిరణ్ దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

