చిక్కడపల్లి : జనవరి 26 గణగంత్ర దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు,యువతకు తెలియ చెప్పాలని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మాకమలాకర్ అన్నారు.
గురువారం అశోక్ నగర్లోని కమలాకర్స్ మైండ్ అండ్ పర్సనాలిటీ కేర్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ కోశాధికారి పి.స్వరూప రాణి, పీ.ఓబుల్ రెడ్డి స్కూల్ పీఈటీ టీచర్ అన్నపూర్ణలతో కలిసి ఆమె మాట్లాడారు.
గణతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత తెలియని విద్యార్థులకు ఇదొక సెలవు, సరదాగా సినిమాలు, షికార్లు, షాపింగ్లతోనూ కాలక్షేపం చేస్తున్నారని వివరించారు. దేశ స్వాతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి సమిధలైన గొప్ప వ్యక్తుల గురించి ఎవరూ చెప్పటం లేదన్నారు.
దేశ స్వాతంత్య్రం మీద నేటి యువతకు సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారత జాతి నిర్మాణ సమర యోధుల జీవిత విశేషాలను యువతకు తెలియ జేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.