సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 5 : రాష్ట్ర ప్రభు త్వం బియ్యం కోటాను మరోసారి పెంచింది. ఈ మేరకు సంగారెడ్డి జిల్లాకు 13169.955 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జనవరి మాసానికి గాను ప్రభుత్వం కేటాయించింది. జిల్లాలో మొత్తం 845 రేషన్ దుకాణాలు ఉండగా, 3,80,375 రేషన్ కార్డుల ద్వారా 12,56,635 వినియోగదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయనున్నారు. జిల్లాలో ఆహార భద్రత కార్డులు, అంత్యోదయ కార్డులు, అన్నపూర్ణ కార్డులకు ఈ బియ్యా న్ని ఉచితంగా అందజేయనున్నారు. రేషన్ వినియోగదారులకు జిల్లాలో పంపిణీ చేయనున్న నిత్యవసర వివరాలు ఈవిధంగా ఉన్నాయి.
ఆహార భద్రత కార్డులు : ఆహార భద్రత (ఎఫ్ఎస్సీ) కార్డుదారులకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేయనుండగా, ప్రతి వ్యక్తికి 5 కిలోలకు మరో 5 కిలోలు కలిపి మొత్తం 10 కిలోల చొప్పున అందజేస్తారు.
అంత్యోదయ కార్డులు : అంత్యోదయ కార్డుదారులకు సంబంధించి ప్రతి కార్డుకు 35 కిలోల బియ్యాన్ని అందిస్తారు. ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.
అన్నపూర్ణ కార్డులు : అన్నపూర్ణ కార్డుదారులకు సంబంధించి ప్రతి కార్డుకు 10 కిలోలు, అదేవిధంగా ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నారు. సబ్సిడీపై అం దిస్తూ ఇతర పదార్థాల వివరాలు పరిశీలిస్తే అం త్యోదయ కార్డుకు ఒక కిలో చక్కెర అందించనుండగా, ధరను కేవలం రూ.13.50 నిర్ణయించారు. హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ప్రతి కార్డుకు 5 కిలోలు, హైదరాబాద్ మినహా జీహెచ్ఎంసీ ఏరియాలో ప్రతి కార్డుకు 3 కిలోలు ఇస్తారు. మున్సిపల్ కార్పొరేషన్లో గోధుమలు ప్రతి కార్డుకు 2 కిలోలు అందిస్తారు. మున్సిపాలిటీలో ప్రతి కార్డుకు 1 కిలో గోధుమలు పంపిణీ చేయనున్నారు. అయితే కిలో గోదుమలకు రూ.7 ప్రభుత్వం నిర్ణయించింది.
సద్వినియోగం చేసుకోవాలి
జిల్లాలోని ప్రతి వినియోగదారుడు లబ్ధి పొందేలా ప్రభుత్వం రేషన్ సరుకులు అందిస్తున్నది. ప్రతి రేషన్ వినియోగదారుడికి ప్రభుత్వం నిర్ణయించిన విధంగా బియ్యం కేటాయించారు. తమ కు కేటాయించిన రేషన్ సరుకులను సంబంధిత రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో రేషన్ సరుకుల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకున్నాం. ప్రభు త్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
-వీరారెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్