
నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కేతేపల్లి, జనవరి 9 : రైతులను రాజులను చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని నకిరేకల్ చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలోని మూసీ కుడి కాల్వ వద్ద వరద నీటిలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఆయన పాల్గొన్నారు. ఎద్దుల బండిపై రైతులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లారు. అనంతరం క్రేన్ మీద నుంచి మూసీ కుడికాల్వ నీటిలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి పూలాభిషేకం, క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధును ప్రవేశపెట్టారని తెలిపారు. రైతుబంధుతో రాష్ట్రంలో పండుగ వాతావరణం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మారం వెంకట్‌రెడ్డి, వెంకన్నయాదవ్, సర్పంచులు బీ.శ్రీనివాస్‌యాదవ్, బి.జానకిరాములు, కె.శ్రవణ్‌కుమార్, కె.వెంకటేశ్వర్రావు, జె.వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు ఎ.వెంకన్నయాదవ్, బి.యాదవరెడ్డి, నాయకులు కె.ప్రదీప్‌రెడ్డి, చల్ల కృష్ణారెడ్డి, బంటు మహేందర్ పాల్గొన్నారు.