కరోనా కలవర పెడుతున్నది. ఒమిక్రాన్ నుంచి ముప్పు పొంచి ఉండడంతో ప్రజల ప్రాణాలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వైద్య, ఆరోగ్య శాఖ వ్యాక్సినేషన్ వేగవంతం చేసింది. ఈ క్రమంలో 18 ఏండ్లకుపైబడిన అందరికీ ఉచితంగా టీకాలు వేస్తున్నది. ఇది వంద శాతానికి చేరువకాగా 15-18 ఏండ్ల మధ్య వయస్కులకూ కొవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా స్కూల్ ఐడీ కార్డులు, ఆధార్ కార్డులతోనూ జనవరి 1 నుంచి రిజిస్ట్రేషన్లు పారంభం కానున్నాయి. 3వ తేదీ నుంచి వీరికి టీకాల వేయనుండడంతో ప్రక్రియ ముమ్మరంగా సాగనున్నది.
నాగర్‌కర్నూల్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : కరోనా కోరలు చాస్తున్నది. రెండేండ్లుగా వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 18 ఏండ్లు పైబడిన వయోజనులకు కోవాగ్జిన్, కోవిషీల్డ్ వంటి టీకాలను ఉచితంగా వేస్తున్నది. వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేశారు. కాగా, ఇటీవల ఒమిక్రాన్ బుసలు కొడుతున్నది. ఈ క్రమంలో 15 నుంచి 18 ఏండ్లలోపు టీనేజర్లకు జనవరి 3వ తేదీ నుంచి వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతించింది. దీనికిగానూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఇందుకు జనవరి 1 నుంచి కొవిన్ యాప్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. టీనేజర్లకు ఓటర్ ఐడీ, పాన్‌కార్డులు లేనందున ఆధార్, విద్యాసంస్థల గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఆధార్ లేకుంటే పదో తరగతి ఐడీ నెంబర్‌ను కూడా ఉపయోగించొచ్చు. ఇంతకుముందు తల్లిదండ్రులు ఇచ్చిన ఫోన్ నెంబర్‌నే వాడుకోవచ్చు. టీనేజర్లకు ప్రస్తుతం కోవాగ్జిన్ ఒక్కటే అందుబాటులో ఉన్నది. స్కూల్, ఇంటర్, డిగ్రీ కాలేజీల నుంచి వైద్యశాఖ విద్యార్థుల వివరాలను సేకరించింది. ఈ వివరాలను రాష్ట్ర అధికారులకు నివేదించనున్నారు. దీని ఆధారంగా జిల్లాలకు టీకా పంపిణీ చేయనున్నది. పాఠశాలలు, కళాశాలల వద్ద వ్యాక్సిన్ వేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో వైద్యులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కాగా తొలి, రెండో డోసుల వ్యాక్సినేషన్‌ను ఈ నెలాఖరు వరకు వంద శాతం పూర్తి చేసేలా వైద్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
ఏర్పాట్లు చేపడుతున్నాం..
ప్రభుత్వ ఆదేశంతో 15 నుంచి 18 ఏండ్ల మధ్య వయస్కులకు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేపడుతున్నాం. నాగర్‌కర్నూల్ జిల్లాలో 75 వేల మందికిపైగా టీనేజర్లు ఉన్నారు. ఇప్పటివరకు 18 ఏండ్లు పైబడిన వారు 6,27,625 మంది ఉండగా.. 6,14,411 మందికి తొలిడోసు టీకా వేశాం. రెండో డోసును 50 శాతంతో 3,09,538 మందికి ఇచ్చాం. ఆధార్, పాన్, ఓటర్‌కార్డులు లేకున్నా కొవిన్‌లో విద్యాసంస్థల ఐడీలతో పేర్లు నమోదు చేసుకోవచ్చు. విద్యాసంస్థల్లో కూడా వ్యాక్సినేషన్‌కు కార్యాచరణ రూపొందిస్తున్నాం.
రిజిస్ట్రేషన్ ఇలా..