Mobile theft | మొబైల్ ఫోన్ దొంగిలించిన సుడాన్ దేశస్థుడి అరెస్ట్

బంజారాహిల్స్ : మొబైల్ షాపులో సెల్ఫోన్ చోరీ చేచిన సూడాన్ దేశస్థుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న సూడాన్ దేశస్థుడు మహ్మద్ అబ్దుల్ రాజెగ్ అనే యువకుడు ఈ నెల 4న పారామౌంట్ కాలనీలో నేషనల్ మొబైల్స్ అనే షాపుకు ఫోన్ రిపేరింగ్ చేయించేందుకు వెళ్లాడు.
ఆ సమయంలో షాపులో పనిచేస్తున్న మహ్మద్ ఇమ్రాన్ పనిమీద లోనికి వెళ్లిన సమయంలో కౌంటర్లో ఉన్న వివో వై 12 అనే ఫోన్ను చోరీ చేశాడు. తిరిగి వచ్చిన ఇమ్రాన్ కు ఫోన్ కనిపించకపోవడంతో రిపేర్ కోసం వచ్చిన అబ్దుల్ రాజెగ్ ఫోన్ చోరీ చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నిందితుడిని సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

