యాదాద్రి, డిసెంబర్ 23 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి నిత్యకల్యాణ్యాన్ని అర్చకులు గురువారం శాస్ర్తోక్తంగా చేపట్టారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీ సుదర్శన నరసింహ హోమాన్ని ఆగమశాస్త్రం ప్రకారం చేపట్టారు. కొండపైన ఉన్న పర్వత వర్ధిని రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీ దేవిని కొలుస్తూ కుంకుమార్చన పూజలు చేశారు. రాత్రి బాలాలయంలోని ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చన పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
వైభవంగా తిరుప్పావై పూజలు
ధనుర్మాస ఉత్సవాల్లో బాలాలయంలో తిరుప్పావై వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాల్లో తొమ్మిదో పాశురాన్ని పఠించి భక్తులకు వినిపించారు. శ్రీవారి ఖజానాకు రూ. 13,27,817 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 94,500
రూ. 100 దర్శనం టిక్కెట్ 37,500
వేద ఆశీర్వచనం 4,200
నిత్యకైంకర్యాలు 4,101
క్యారీబ్యాగుల విక్రయం 4,950
వ్రత పూజలు 68,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 16,000
ప్రసాద విక్రయం 5,52,750
వాహనపూజలు 12,000
టోల్గేట్ 1,430
అన్నదాన విరాళం 8,298
సువర్ణ పుష్పార్చన 1,10,800
యాదరుషి నిలయం 45,300
పాతగుట్ట నుంచి 26,000
గోపూజ 300
ఇతర విభాగాలు 3,13,688