మెదక్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. శనివారం మెదక్లో మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణంలోని 24 వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అంకం చంద్రకళకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ విస్మరించి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్లిందని తెలిపారు. కానీ అబద్దపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఏ మాత్రం అభివృద్ధి జరగలేదని అన్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. కారు గుర్తుకు ఓటేసి అభ్యర్థి అంకం చంద్రకళ రవిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.