
తిరుమలగిరి, డిసెంబర్ 24 : క్రైస్తవుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని మున్సిపల్ చైర్పర్సన్ పోతరాజు రజిని అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రభుత్వం తరఫున క్రైస్తవులకు కానుకలు పంపిణీ చేశారు. అన్నిమతాలకు సమ ప్రాధాన్యం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. క్రైస్తవులు క్రిస్మస్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. తాసీల్దార్ సంతోష్ కిరణ్, పాస్టర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు.
కోదాడటౌన్ : పట్టణంలోని 30వ వార్డులో పేద క్రైస్తవులకు వార్డు కౌన్సిలర్ పెండెం వెంకటేశ్వర్లు ప్రభుత్వం తరఫున గిఫ్ట్ ప్యాక్‌లు పంపిణీ చేశారు. బతుకమ్మ, రంజాన్ పండుగల మాదిరిగా క్రిస్మస్ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని గుర్తుచేశారు. క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కట్టెబోయిన శ్రీనివాస్ యాదవ్, వార్డు వాసులు పాల్గొన్నారు.
రామన్నగూడెంలో విందు
అర్వపల్లి : మండలంలోని రామన్నగూడెం వీకే గార్డెన్స్‌లో క్రైస్తవులకు అధికారులు క్రిస్మస్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి పాస్టర్లతో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ఆర్ఐ కరుణాకర్, టీఆర్ఎస్ నాయకులు మన్నె లక్ష్మీనర్సయ్యయాదవ్, పాస్టర్లు చంద్రశేఖర్, కరుణకుమార్, జీవరత్నం, ప్రభుదాస్, దామోదర్ పౌల్, వీఆర్ఓలు పాల్గొన్నారు.
నిత్యావసరాలు పంపిణీ..
మునగాల : మండలంలోని విజయరాఘవాపురం ఉద్యోగుల సమాఖ్య, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, విశ్రాంత ఎస్బీఐ మేనేజర్ కంకణాల మధు గ్రామస్తులకు చీరెలు, నిత్యావసరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యశోద, సుంకర పిచ్చయ్య, పోతురాజు నర్సయ్య, సుంకర నర్సయ్య, ప్రభాకర్, నరేంద్రబాబు, రోజా పాల్గొన్నారు.