సిద్దిపేట, జనవరి 8 : జిల్లాలోని కార్మికులందరికీ బీమా..ఈ-శ్రమ్‌లో నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మిక శాఖ క్షేత్ర అధికారులతో శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, కార్మికులు జిల్లాలో కార్మికశాఖ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. జిల్లాలో 2018లో 124 మంది కార్మికులకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.52.80లక్షలు, 2019లో 473 మందికి రూ.2.68కోట్లు, 2020లో 522 మందికి రూ.4.19కోట్లు, 2021లో 639 మందికి, రూ.3 కోట్ల 26లక్షల 6వేలు ఆర్థిక ప్రయోజనాలు అందించామని తెలిపారు. ఈశ్రమ్ కింద 35 వేల మందిని, కార్మిక బీమా కింద 45వేల మందిని నమోదు చేశామన్నారు. లేబర్ కార్డు పొందిన వ్యక్తికి లేదా కుటుంబ సభ్యుడికి న్యాక్ ద్వారా 3 నెలల ఉచిత కుట్టు శిక్షణ, సంక్రాంతి తర్వాత ఉచిత కంప్యుటర్ శిక్షణను అందించనున్నట్లు అధికారులు మంత్రి వివరించారు. అనంత రం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ జిల్లా లో కార్మిక సంక్షేమ పథకాల అమలు, మం జూరులో అక్రమాలు జరుగుతున్నట్లు అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, లేబర్ ఆఫీస్ అవినీతికి అడ్డాగా, పైరవీకారులు, బ్రోకర్ల కేం ద్రంగా మారినట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. అధికారులు పనితీరు మార్చుకోవాలని మంత్రి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా సహా ఉమ్మడి జిల్లాలోనూ కార్మికులందరికీ బీమాతోపాటు అసంఘటింత రంగ కార్మికులకు భద్రతను కల్పించేందు తెచ్చిన ఈ- శ్రమ్‌లో నమోదు చేయించేందుకు ప్రతి నియోజకవర్గంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులతో సహకారంతో అవగాహన, చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. భవన, ఇతర నిర్మాణ రం గంలో కార్మికులకు బీమా కింద లక్ష మందిని ఈ-శ్రమ్ పథకంలో 5 లక్షల వరకు నమోదు చేయించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట కార్మిక శాఖ సహాయ కమిషనర్ కేరవీందర్రెడ్డి, సిద్దిపేట కార్మిక సహాయ అధికారి నరేందర్‌రాజు, గజ్వేల్ అధికారి జ్యోతి, జిల్లా భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక యూనియన్ గౌరవాధ్యక్షుడు మచ్చవేణుగోపాల్‌రెడ్డి, న్యాక్ బాధ్యులు శ్రీలక్ష్మీనరసింహ, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు కళాంజలి రాజేశ్ సొంతంగా తయారు చేయించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 చైతన్య రథాన్ని మంత్రి ప్రారంభించారు.