
ఇల్లెందు, జనవరి 3: దేశమంతా తెలంగాణ వైపే చూస్తోందని, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మరువలేనివని, ప్రజలంతా టీఆర్ఎస్తోనే ఉన్నారని, అందుకే గులాబీ జెండాకు బ్రహ్మరథం పడుతున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియనాయక్ అన్నారు. ఎమ్మెల్సీగా విజయం సాధించి ఇల్లెందుకు వచ్చిన తాతా మధుకు సోమవారం స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డులో నిర్వహించిన ఆత్మీయ అభినందన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కడుతున్నారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న సీఎం కేసీఆర్ను ప్రజలు కొనియాడుతున్నారని, ఆయన పథకాలను మరువలేరని అన్నారు.
ఇల్లెందు ప్రజలంటే ప్రత్యేక అభిమానం: మధు
ఇల్లెందుతో తనకు విడదీయరాని అనుబంధం ఉందని, వారంటే తనకు ప్రత్యేక అభిమానమని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. బొగ్గుట్ట ప్రజలు తనపై చూపే ఆప్యాయతకు తానెప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ జానీపాషా, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొక్కు నాగేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు పాల్గొన్నారు.