
పుల్కల్ రూరల్, ఆగస్టు 14 : నూతన గ్రామ పం చాయతీ భవన నిర్మాణానికి స్థలం ఇవ్వడం అభినందనీయమని సంగారెడ్డి జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శనివారం పలు గ్రామాల్లో ప్రారంభోత్సవాలు, ప్రకృతి వనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మండల కేంద్రం పుల్కల్లో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని జడ్పీ చైర్పర్సన్, ఎమ్మె ల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం దాత మన్నె నర్సింహులు పంచాయతీ నిర్మాణానికి తన సొంత స్థలం ఉచితంగా ఇవ్వడం అభినందనీయమని కొనియాడారు. శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మం డల కేంద్రమైన పుల్కల్లో నిర్మించిన 48 డబుల్ బెడ్రూంలు పూర్తయినట్లు చెప్పారు. ఇండ్లులేని నిరుపేదలు, పార్టీలకు అతీతంగా ఈ నెల 17 నుంచి తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఏం చేశాయో.. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి సీఎం కేసీఆర్ ఎన్ని పథకాలు తీసుకొచ్చారో ఒకసారి ఆలోచించుకోవాలన్నారు. ఎస్ ఇటిక్యాల్, బస్వాపూర్ గ్రామాల్లోని బృహత్ ప్రకృతి వనం, హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మంతూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అం బేద్కర్ బాటలోనే యువత ముందుకు సాగాలని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నా రు. కార్యక్రమంలో తహసీల్దార్ పరమే శం, ఎంపీడీవో మధులత, ఆత్మకమిటీ చైర్మన్ యాదగిరిరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల నాయకుడు నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు విజయ్‌కుమార్, విజయ్‌భాస్కర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్‌లు శ్రావణ్‌కుమార్, సంగమ్మ విష్ణయ్య, రాధయ్య, శివమ్మ, రాజాగౌడ్, ఎంపీటీసీ అవుసలి శ్రీనివాస్‌చారి, పీఏసీఎస్ డైరెక్టర్ మహేశ్‌బాబు ముదిరాజ్, నాయకులు కనకారెడ్డి, మాజీ సర్పంచ్ మఠం సిద్దన్న పాల్గొన్నారు.