పటాన్చెరు, అక్టోబర్ 12 : సాధారణ అంతర్జాల శోధన పద్ధతులను ఉపయోగించిన నిర్ధారిత సమాచారాన్ని పొందడానికి ఆధునిక విధానాలను రూపొందించి, సిద్ధాంత వ్యాసం సమర్పించిన హైదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్డీ వరప్రసాద్‌కు డాక్టరేట్ వచ్చినట్లు గీతం ప్రతినిధులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉషారమ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ కే రాజశేఖర్‌రావు మార్గదర్శనంలో పరిశోధనలు చేసి గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టాకు ఆయన అర్హత సాధించినట్లు చెప్పారు. యూనిఫామ్ రిసోర్స్ లింక్ ద్వారా అనుసంధానం అవుతుందో లేదో తనిఖీ చేయడానికి మిశ్రమ (హైబ్రిడ్) విధానాన్ని ఉపయోగించి, అంతర్జాల సమచారాన్ని భద్రంగా సేకరించడానికి ఈ పరిశోధనలో ప్రాధాన్యం ఇచ్చినట్లు వివరించారు. ఈ సందర్భంగా వరప్రసాద్‌ను గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఇంజినీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీకే మిట్టల్, అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్ సీతారామయ్య, పలువురు అధ్యాపకులు అభినందించారు.