నారాయణపేట రూరల్, డిసెంబర్ 22: గణిత పితామహుడు రామానుజన్ పుట్టిన రోజును పురస్కరించుకొని బుధవారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శ్రీహంసవాహిని, శ్రీసాయి, రవితేజ పాఠశాలల్లో ఆయన చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాలల హెచ్ఎంలు శ్రీనివాస్, రాజేశ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న
నారాయణపేట టౌన్, డిసెంబర్ 22: రామానుజన్ జయంతి సందర్భంగా పట్టణంలోని కృష్ణవేణి పాఠశాలలో గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. గణిత శాస్త్ర నమూనాలు, ఆకారాలతో విద్యార్థుల రంగవల్లులు పలువురిని విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నరేశ్‌కుమార్, ఉపాధ్యాయులు ప్రభాకర్, భాగ్య పాల్గొన్నారు. శ్రీ సరస్వతి శిశుమందిరం ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఉపన్యాసం, ఎక్కములు, వ్యాసరచన, డ్రాయింగ్, మట్టితో గణిత ఆకృతుల పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు దత్తూచౌదరి, ఆచార్యులు రోషనప్ప, లక్ష్మీదేవి, విద్యార్థులు పాల్గొన్నారు.
బహుమతుల ప్రదానం
నర్వ, డిసెంబర్ 22: గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను మండల కేంద్రంలోని సూర్యవిద్యామందిర్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్విజ్, గణితశాస్త్రం వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి, గెలుపొందిన వారికి టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు రామన్‌గౌడ్ చేతులమీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ సత్యం, సిబ్బంది నరేశ్, ప్రవీణ పాల్గొన్నారు.
గణితంపై ఆసక్తి పెంచుకోవాలి
ఊట్కూర్, డిసెంబర్22: విద్యార్థులు గణితంపై ఆసక్తిని పెంపొందించుకోవాలని ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, లక్ష్మీనారాయణ, గోపాల్ సూచించారు. గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని మండలంలోని బిజ్వారం, నిడుగుర్తి, కొత్తపల్లిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు గణితంలో ప్రతిభా పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకటప్ప, శ్రీనివాస్, సలాం, లియాఖత్, ఆంజనేయులు, ఆనంద్, స్వేత పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
మాగనూర్, డిసెంబర్22: గణితశాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని మండలంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన గణితశాస్త్ర ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ రాజు, ప్రధానోపాధ్యాయులు గణేశ్‌సింగ్, ఉపాధ్యాయులు రాంమోహన్, తిమ్మప్ప, నర్సింహులు, వసంత్‌కుమార్, వేణుగోపాల్ పాల్గొన్నారు.
గుడెబల్లూర్‌లో..
కృష్ణ, డిసెంబర్ 22: మండలంలోని గుడెబల్లూర్ గ్రామంలోని ప్రభుత్వ పాశాలలలో గణిత దినోత్సవం సందర్భంగా బుధవారం గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఖుర్షిదాబేగం, ఉపాధ్యాయులు రిషిక పాల్గొన్నారు.
విద్యార్థులకు పోటీలు
ధన్వాడ, డిసెంబర్ 22: ధన్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం శ్రీ రామానుజన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా రామానుజన్ చిత్రపటానికి నివాళులర్పించారు. ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ అబ్దుల్ ముజీబ్, అధ్యాపకులు రాఘవేందర్, సాంబశివుడు, గోపి, నర్సయ్యతో పాటుగా పలువురు పాల్గొన్నారు.
క్విజ్ పోటీలు
మరికల్, డిసెంబర్ 22: రామానుజన్ జయంతిని పురస్కరించుకొని బుధవారం మండల కేంద్రంలోని సరస్వతి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రిన్సిపాల్ చంద్రశేఖర్‌రెడ్డి బహుమతులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రాములు, అధ్యాపకులు వెంకటేశ్, లక్ష్మీకాంత్, పట్నయ్య, రఘుకుమార్ పాల్గొన్నారు.