Toddy shop | కల్లు దుకాణాలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి

హిమాయత్‌నగర్ : రాష్ట్రంలోని గౌడ కులస్తుల ఆత్మగౌరవమైన కల్లు దుకా ణాలను కించపర్చేలా టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావు గౌడ్ డిమాండ్ చేశారు.
గురువారం హిమాయత్‌నగర్‌లోని సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డుతూ కల్లు కంఫౌండ్లు గౌడ్లకు దైవంతో సమానమని అలాంటి పవిత్రమైన వృత్తిని చులకన చేసి మాట్లాడటం రేవంత్ కు తగదన్నారు. గతంలో గౌడ కులస్తులతో పెట్టుకున్న ప్రభుత్వాలకు ఏం గతి పట్టిందో రేవంత్ గుర్తు చేసుకోవాలని హితవుపలికారు.
గౌడ్స్‌కు ఐదు ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవనం నిర్మాణం, ఐదు కోట్ల నిధులు కేటాయింపు, ప్రమాద పరిహారం పెంపు, వైన్స్లలో రిజ ర్వేషన్లు,నీరా అనుమతి వంటి సంక్షేమ చర్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టడంతో గౌడ్లు టీఆర్ఎస్ పార్టీ వైపు ఉండటాన్ని జీర్ణించుకోలేక రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
గౌడ్లకు తక్షణమే రేవంత్‌రెడ్డి క్షమాపణ చేప్పాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో గౌడ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రశాంత్‌గౌడ్, ఉపాధ్యక్షుడు సంజయ్‌గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

