Unauthorized structure | అనుమతులులేని నిర్మాణాన్నికూల్చేసిన రెవెన్యూ సిబ్బంది
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మించిన షెడ్లను షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చేశారు.
బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎన్బీటీనగర్లో అనుమతులు లేకుండా రాత్రికి రాత్రే నిర్మించిన షెడ్లను షేక్‌పేట మండల రెవెన్యూ అధికారులు మంగళవారం కూల్చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి బంధువుకు ఎన్బీటీనగర్ కమాన్‌లో సుమారు 600గజాల స్థలం ఉంది.
ఈ స్థలంపై గతంలో సుప్రీంకోర్టులో వివాదం ఉండడంతో క్రమబద్దీకరణ దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది.కాగా రెండేళ్ల క్రితం ఈ స్థలం ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టులో తీర్పువచ్చింది. అయితే ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు లేకపోవడంతో తాజాగా విడుదల అయిన జీవో 59 కింద క్రమబద్దీకరణ చేసుకోవడం సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రెండ్రోజుల క్రితం రాత్రికి రాత్రే షెడ్డును నిర్మించారు.
ఈ వ్యవహారంపై ఫిర్యాదులు అందుకున్న షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం అక్రమ నిర్మాణాలను కూల్చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

