హుజూరాబాద్టౌన్, డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకలను ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలని హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డి సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒమిక్రాన్ వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ మాసు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. నూతన సంవత్సర వేడుకలను ఎవరి ఇండ్లలో వారు జరుపుకోవాలని సూచించారు. 31న రాత్రి ప్రత్యేక బృందాల ద్వారా అన్ని గ్రామాల్లో నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. పెట్రోలింగ్ నిర్వహించి నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాల తనిఖీ చేపట్టి కేసులు నమోదు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు ప్రతిఒకరూ పాటించాలని కోరారు. ప్రతి ఒకరూ కరోనా, పోలీసుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. టౌన్, రూరల్ సీఐలు వీరబత్తిని శ్రీనివాస్, ఎర్రల కిరణ్ తదితరులున్నారు.
ఇండ్లలోనే వేడుకలు జరుపుకోవాలి
ఇల్లందకుంట, డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకలను ఇండ్లలోనే జరుపుకోవాలని ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు. గురువారం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒమ్రికాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జనవరి 2వ తేదీ వరకు ఆంక్షలు విధించిందన్నారు. మద్యం సే వించి వాహనాలను నడిపితే వాటిని సీజ్ చేస్తామని, కేసులు నమోదు చేస్తామని చెప్పారు. వీ ధుల్లో ర్యాలీలపై నిషేధం ఉందని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.