
కూసుమంచి, డిసెంబర్ 16: యాసంగి సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం పాలేరు జలాశయం నుంచి గరువారం ఎన్నెస్పీ ఈఈ అనన్య, డీఈఈ మధు, ఏఈఈఈ ఇమ్రాన్ అహ్మద్ గురువారం 1,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. పంటలకు ఖమ్మం జిల్లాలోని 17 మండలాల పరిధిలోని 2.40 లక్షల ఎకరాలకు 78 రోజుల పాటు 31.49 టీఎంసీల సాగు నీరు అందనున్నది. వారబందీ పద్ధతిలో నీటి కేటాయింపు ఉంటుంది. శుక్రవారం అధికారులు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి 3,500 క్యూసెక్కులకు పెంచి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.