వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు మంగళవారంతో ముగియనున్న గడువు
నిబంధనల మేరకు 57 ఏండ్లు నిండినవారందరూ అర్హులు
దరఖాస్తుకు పైసా చెల్లించాల్సిన అవసరం లేదు
జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు మీ-సేవ నుంచి 20 వేల దరఖాస్తులు
ఓటరు జాబితా ఆధారంగా ఇప్పటికే 31,917 మంది ఉన్నట్లు గుర్తింపు
వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల జారీకి సర్కారు నిర్ణయం
జిల్లాలో ప్రస్తుతం 1,64,724 మందికి ఆసరా పింఛన్లు
ప్రతి నెలా రూ.38.21 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెలా వృద్ధులకు పింఛన్లను అందజేస్తూ కొండంత భరోసానిస్తున్నది. పేదల శ్రేయస్సు కోసం ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు కుదించిన విషయం తెలిసిందే. మీసేవలో పైసా ఖర్చు లేకుండా దరఖాస్తు చేసుకునేలా రాష్ట్ర సర్కార్ అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగియనుండటంతో అర్హులైనవారు త్వరపడాలని అధికారులు సూచిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓటరు జాబితా ఆధారంగా 31,917 మంది అర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇప్పటి వరకు 20 వేల దరఖాస్తులు రాగా, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లను అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 1,64,724 ఆసరా పింఛన్లను అందజేస్తుండగా, ప్రతి నెలా రూ.38.21 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. సర్కారు తీసుకున్న నిర్ణయానికి అర్హులైన లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, ఆగస్టు 29, (నమస్తే తెలంగాణ): జిల్లాలో వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తుకు రేపటితో గడువు ముగియనున్నది. దరఖాస్తు తేదీని మరో సారి పెంచే అవకాశం లేదు కాబట్టి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సం బంధిత అధి కారులు సూచిస్తున్నారు. దీంతో మీసేవ కేంద్రాల వద్ద బారు లు తీరుతున్నారు. దరఖాస్తులు జిల్లావ్యాప్తంగా భారీగా వస్తున్నా యి. రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల వయస్సును 57 ఏండ్లకు కుదించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా 57 ఏండ్ల నుంచి 64 ఏండ్ల లోపు వారు మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదే విధంగా దరఖాస్తుకు అయ్యే డబ్బులను కూడా మీసేవా నిర్వాహకులకు ప్రభుత్వమే చెల్లించనున్నది. అయితే ఎవరైనా మీసేవ నిర్వాహకులు పింఛన్ల దరఖాస్తు నిమిత్తం డబ్బులు వసూలు చేసినట్లయితే జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయ వచ్చని సంబంధిత అధికారులు ప్రకటించారు. మీసేవ దరఖాస్తులతోపాటు గతంలో ఓటరు జాబితా ఆధారంగా సిద్ధం చేసిన అర్హుల జాబి తాను కూడా పరిగణనలోకి తీసుకోనున్నారు. జిల్లాలో 1, 64, 724 పింఛనుదారులుండగా ప్రతినెలా పింఛన్ల నిమిత్తం రూ.38.21 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. వృద్ధాప్య పింఛన్ల నిమిత్తం మీ సేవ నుంచి వచ్చే దరఖాస్తుల సంఖ్య ఇప్పటివరకు 20 వేలకు చేరింది. ఈనెల 16 నుంచి 57-64 ఏండ్ల మధ్య వయస్సుగల వారి నుంచి మీసేవ ద్వారా దరాఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ అనంతరం అర్హులను గుర్తించి జాబి తాను సిద్ధం చేయనున్నారు. అయితే జిల్లా వ్యాప్తంగా మీసేం ద్వారా 20 వేల దరఖాస్తులు రాగా, ఓటరు జాబితా ఆధారంగా 31,947 మంది అర్హులుగా గుర్తించారు. ఓటరు జాబితా ఆధారంగా వివరాలను సేకరించి పరిశీలన ప్ర క్రియను ఇప్పటికే చేపట్టారు. వీరిలో మరణించిన వారెవరైనా ఉన్నారా, ఇత ర పింఛన్లు ఎవరైనా తీసుకుంటున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. పింఛన్లకు అర్హులను ఎంపిక చేసేందుకుగాను ప్రభుత్వం పలు నిబంధనలను విధించింది. ఒక ఇంట్లో ఒక్కరికి మాత్రమే పింఛను ఇవ్వనున్నారు. 57 ఏండ్లు నిండడంతోపాటు మెట్ట భూమి ఏడు న్నర ఎకరాలు, మాగాణి మూ డు ఎకరాల్లోపు ఉండాలని, దరఖాస్తుదారుడి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాం తాల్లో వార్షిక ఆదాయం రూ.2 లక్షలలోపు ఉండాలని, విశ్రాంత ప్రభు త్వ ఉద్యోగులు, స్వాతంత్ర సమరయోధుల కోటాలో పింఛన్ పొందుతున్న వారు, దరఖాస్తు చేసుకునే వారికి పెద్ద వ్యాపారాలు, పెద్ద వాహనాలు ఉండరాదని, ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారు అనర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా దరఖాస్తుదారు లు దారిద్య్రరేఖకు దిగువన ఉండాలని, దరఖాస్తుదారుల పిల్లలు ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసే వారుంటే అనర్హులుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. జిల్లాలో ప్రస్తు తం 1,64,724 ఆసరా పింఛన్లు ఉం డగా,…వృద్ధాప్య పింఛన్లు 53,381 పింఛన్లు, వితంతు పింఛన్లు 76,503 పింఛన్లు, దివ్యాంగులకు సంబంధించి 26,120 పింఛన్లు, కల్లు గీత కార్మికులు 757 మంది చేనేత కార్మికులు 2017 మంది ఒంటరి మహిళలు 5930 మంది బీడీ కార్మికులు 16 మంది పింఛన్దారులు ఉన్నారు. కాగా జిల్లావ్యాప్తంగా ఆసరా పింఛన్ల నిమిత్తం ప్రభుత్వం ప్రతీ నెల రూ.38.21 కోట్లను ఖర్చు చేస్తున్నది.