మణుగూరు రూరల్, జనవరి 5: “రైతులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించారు. ఆ ‘రైతు బంధు’వు సాయంతో పెట్టుబడి కష్టాలు తీరాయంటూ రైతులు ఆనందపడుతున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు” అని జడ్పీటీసీ సభ్యుడు పోశం నర్సింహారావు, ఎంపీపీ విజయకుమారి అన్నారు. మణుగూరు మండలంలోని అన్ని గ్రామాల్లో బుధవారం రైతు బంధు సంబురాలు జరిగాయి. వారు మాట్లాడుతూ… రైతు సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. ఈ వేడుకల్లో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, సర్పంచులు ఏనిక ప్రసాద్, జంపేశ్వరి, పాల్వంచ ఈశ్వరమ్మ, కారం ముత్తయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు, నాయకులు మేకల రవి, తాతా రమణ, పాకల రమాదేవి, గంగారపు రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లపల్లి: మండలంలోని మర్కోడు రైతు వేదికలో జరిగిన సంబురంలో జడ్పీటీసీ సభ్యుడు కొమరం హనుమంతరావు, సర్పంచులు శంకర్‌బాబు, నర్సింహారావు, ప్రేమకళ, వెంకటనారాయణ, ఏఈవో అరుణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నరసింహారావు, నాయకులు రాంబాబు, సతీష్ పాల్గొన్నారు.
బూర్గంపహాడ్: మండలంలోని మోరంపల్లిబంజర, బూ ర్గంపహాడ్ రైతు వేదికల్లో జరిగిన వేడుకల్లో ఏవో శం కర్, ఏఎంసీ సెక్రటరీ నిర్మల, ఏఈవో ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చర్ల: మండలంలోని సత్యనారాయణపురం రైతు వేదిక ప్రాంగణంలో జరిగిన వేడుకలో రైతుబంధు సమితి జిల్లా కమిటీ సభ్యురాలు గుమ్మడి నవభారతి, వ్యవసాయాధికారి శివరామ ప్రసాద్ పాల్గొన్నారు.
కరకగూడెం: మండలంలోని సమత్‌భట్టుపల్లి రైతు వేదికలో జరిగిన వేడుకలో ఎంపీపీ రేగా కాళిక, మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు వట్టం వెంకటేశ్వర్లు, సర్పంచ్‌లు పోలెబోయిన శ్రీవాణి, కుంజా వసంతరావు, కొమరం విశ్వనాథం, నరసింహారావు, ఉప సర్పంచ్ రావుల రవి, ఏవో వినయ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, పోగు వెంకటేశ్వర్లు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం: మండలంలోని గంగోలు, నర్సాపురం, మారాయిగూడెం, ఆర్లగూడెం, లచ్చిగూడెం గ్రామాల్లోని రైతు వేదికల్లో వేడుకలు జరిగాయి. జడ్పీటీసీ సభ్యురాలు తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బత్తుల శోభన్‌బాబు, ఏవో నవీన్‌కుమార్, ఏఈవో బాలాజీ, ఎంపీటీసీ సభ్యులు తిరుపతిరావు, తెల్లం భీమరాజు, మ డకం రామారావు, సర్పంచ్‌లు నూపా సుమిత్ర, జు జ్జూరి లక్ష్మి, మడకం చంద్రశేఖర్, మడకం నాగేంద్ర, కొర్సా సునీత, సోందె నాగమణి, రైతుబంధు సమితి సభ్యులు కణితి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
పర్ణశాల: మండలంలోని పెద్దనల్లబల్లి రైతు వేదికలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ రేసు లక్ష్మి, గౌరారం సర్పంచ్ జ్యోతి, ఏఈవో హసీనా పాల్గొన్నారు.
గుండాల: మండలంలోని రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్, పీఏసీఎస్ చైర్మన్ గొగ్గెల రామయ్య క్షీరాభిషేకం చేశారు. ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కల్తి పెద లింగయ్య, సర్పంచులు మోహన్, నర్సింహారావు, అబ్దుల్ నబీ, గడ్డం రమేష్, జాడి ప్రభాకర్, గందగిరి నాగరాజు, పూనెం సత్యం, చంద్రయ్య, టీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అజ్జు, టి.రాము పాల్గొన్నారు.
పినపాక: మండలంలోని ఈబయ్యారం పాతరెడ్డిపాలెం గ్రామాల్లో జరిగిన వేడుకల్లో మణుగూరు వ్యవసాయ సహాయ సంచాలకుడు తాతారావు, ఏవో వెంకటేశ్వర్లు, ఏఈవో లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.