
ఏన్కూరు, జనవరి 7: తెలంగాణలో రైతే రాజని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సాగు పథకాలు అమలవుతున్నాయని అన్నారు. రైతుబంధు, రైతు బీమా, ఉచిత్ విద్యుత్, పుష్కల నీటి వనరులు, మద్దతు ధరలు వంటి పథకాలు, సౌకర్యాలతో కర్షకులంతా గుండెధైర్యంతో సాగు పనులు చేపడుతున్నారని వివరించారు. అన్నదాతలకు అన్నీ తానైన కేసీఆర్.. వారి కుటుంబాల్లో చెరగని స్థానం సంపాదించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమించి వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి రైతుకు గొప్ప స్థానం కల్పించారని అన్నారు. ఏన్కూరు వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం జరిగిన రైతుబంధు వారోత్సవాల్లో ఆయన మాట్లాడారు. అన్నదాతలను అనేక విధాలుగా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి కర్షక కుటుంబాలన్నీ అండగా నిలవాలని కోరారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు. మార్క్ఫైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ మాట్లాడుతూ రైతుబంధు వంటి పథకాలను ఇతర రాష్ర్టాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయన్నారు. సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు బానోతు సురేశ్నాయక్, మేడా ధర్మారావు, భూక్యా లాలునాయక్, రుక్మిణి, నరసింహారావు, నామాల శ్రీనివాసరావు, నాగరత్నం, అశోక్, యలమద్ది జనార్దన్, దొబ్బల సత్యం, ఆది నరసింహారావు, భుక్యా బాలాజీ, భూక్యా చందులాల్నాయక్, శోభన్నాయక్, బానోతు రామారావు, గిద్దగిరి సత్యనారాయణ, కట్ట సత్యనారాయణ, వర్ధబోయిన శ్రీనివాసరావు, షేక్ బాజీ, ఇటికాల రాజు, ముక్తి వెంకటేశ్వర్లు, నల్లమల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. తొలుత అన్నదాతలను ఎమ్మెల్యే, అధికారులు, రైతులు సన్మానించారు. అనంతరం రైతులు కూడా ఎమ్మెల్యేను సత్కరించారు.