
గుమ్మడిదల, డిసెంబర్ 23 : మట్టిలో మాణిక్యాలు గుమ్మడిదల రైతు సోదరులని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని గుమ్మడిదల రైతు సంఘం అధ్యక్షుడు పోచుగారి మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో కిసాన్ దివస్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధానమంత్రి చరణ్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలో గుమ్మడిదల రైతు సోదరులు ఉత్తమ రైతులుగా మంచి పేరు తెచ్చుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక్కడి రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలుగా పేరుతెచ్చుకుంటున్నారన్నారు. కేంద్రం యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనమని చెప్ప డం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునే వరకు నిరసనలు చేస్తామన్నారు. అనంతరం ఉత్తమ రైతులు, వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు, వైద్యసిబ్బందిని ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సద్దిప్రవీణావిజయ భాస్కర్‌రెడ్డి, జడ్పీటీసీ కుమార్‌గౌడ్, ఏడీఏ సురేశ్‌బాబు, ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులు శైలజ, జావీద్, తహసీల్దార్ సుజాత, పీహెచ్సీ డాక్టర్ శ్రీధర్, సీఐ లాలూనాయక్, ఎస్సై విజయకృష్ణ, పీఏసీఎస్ చైర్మన్ నంద్యాల విష్ణువర్ధన్‌రెడ్డి, రైతు సంఘం మాజీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, సర్పంచ్‌లు, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు మహ్మద్ హుస్సేన్, రైతులు పాల్గొన్నారు.